• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

phone security

Whatsappలో అర్జెంటుగా ఈ సెట్టింగ్ డిజేబుల్ చేయండి!

by

Disable Whatsapp Google Drive backup

Whatsapp అందరూ తప్పనిసరిగా వాడుతున్నారు కాబట్టి, అందులో అంతర్గతంగా లభిస్తున్న ఒక సెట్టింగ్ చాలామంది ఎనేబుల్ చేసి ఉంటున్నారు. దానివల్ల ఇటీవలికాలంలో ప్రైవసీ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపధ్యంలో దాన్ని డిజేబుల్ చేసుకోవటం ఉత్తమం.

Whatappలో ఎప్పటికప్పుడు మీ ఛాట్ మొత్తం బ్యాక్అప్ అవ్వడం కోసం Google Driveలో ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం కదా. సహజంగా మన ఫోన్లో స్టోరేజ్ మిగుల్చుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇలా గూగుల్ డ్రైవ్ లోకి మీ వాట్సాప్ బ్యాక్అప్ అవడంలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇలా బ్యాకప్ అయ్యే సమయంలో మీ ఛాట్ ప్లెయిన్‌గా బ్యాకప్ అవుతుంది. దాని మీద ఎలాంటి ఎన్క్రిప్షన్ అప్లై చేయబడదు. ఈ కారణం చేత మీ గూగుల్ అకౌంట్ యాక్సిస్ చేయగలిగిన ఎవరైనా ఆ డేటాబేస్ సులభంగా యాక్సెస్ చేసి అందులో మీ ఛాట్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు.

iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhone యూజర్లకి కూడా ఇదే రకమైన ప్రమాదం ఉంటుంది. వారు తమ iCloud అకౌంట్ లోకి చాట్ బ్యాకప్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొని ఉంటారు. అక్కడ కూడా ఛాట్ ప్లెయిన్‌గా బ్యాకప్ అవుతుంది. అందుకే మీరు Android వాడుతున్నా, iOS వాడుతున్నా క్లౌడ్ స్టోరేజ్ లోకి చాట్ బ్యాకప్ అయ్యే విధంగా కాకుండా మీ లోకల్ స్టోరేజీలో, అంటే మీ ఫోన్ లోనే ఎప్పటికప్పుడు వాట్స్ఆప్ బ్యాకప్ అయ్యే విధంగా సెట్టింగ్ మార్పిడి చేసుకోవడం మొత్తం. దీనివలన మీ ఛాట్ సురక్షితంగా ఉంటుంది.

ముఖ్యంగా ఇటీవల ముంబై డ్రగ్స్ కేసులో సరిగ్గా ఇదే పద్ధతి ఆధారంగా గూగుల్ స్టోరేజ్ నుండి చాట్ బ్యాకప్ వెలికితీసి విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే. నేర పరిశోధన విషయంలో ఇది బానే ఉంటుంది కానీ, వ్యక్తుల ప్రైవసీ విషయంలో మాత్రం ఈ ఆప్షన్ ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వెంటనే మీ Whatsapp అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో backup optionsలో Google Drive, iCloudలకి బదులు లోకల్ బ్యాకప్‌ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

Filed Under: How-To Guide Tagged With: android security, Disable Whatsapp Google Drive backup, google drive backup, iCloud Backup, phone security, whatsapp

Google Chrome వాడుతున్నవారు అర్జెంటుగా అప్డేట్ చేసుకోండి!

by

google chrome update security flaws

డెస్క్టాప్ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లో అధిక శాతం మంది యూజర్లు Google Chrome బ్రౌజర్ ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా ఇది శక్తివంతమైన బ్రౌసర్ అనడంలో సందేహమే లేదు. అయితే అన్నిరకాల సాఫ్ట్వేర్లలో మాదిరిగానే దీనిలో కూడా అప్పుడప్పుడు కొన్ని సెక్యూరిటీ లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూడు కీలకమైన సెక్యూరిటీ లోపాలను బయటపడడం, Google సంస్థ వాటిని సరి చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా మీ డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో, అలాగే smartphoneలో వాడుతున్న Google Chrome బ్రౌజర్‌ని అప్డేట్ చేయండి. ఈ మూడు లోపాల గురించి గూగుల్ సంస్థ పూర్తి వివరాలు వెల్లడించక పోయినప్పటికీ అవి బ్రౌజర్ సెక్యూరిటీ విషయంలో కీలకమైనవని తెలుస్తోంది. వాస్తవానికి విండోస్ లేదా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా అప్డేట్ అయి మనం బ్రౌజర్ రీస్టార్ట్ చేసినప్పుడు అది దానంతట అదే అప్లై అవుతుంది.

Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా స్మార్ట్ఫోన్ వాడేవారు కొన్ని సందర్భాలలో ఆటో అప్డేట్ డిజేబుల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు అశ్రద్ధ చేయకుండా అప్డేట్ చేయడం మంచిది. ఫ్రీ-టైప్ ఫాంట్ రెండరింగ‌లో కూడా కొన్ని కీలకమైన లోపాలు బయటపడ్డాయి. దాన్ని కూడా గూగుల్ సంస్థ పరిష్కరించింది. ఒకవేళ మీరు అప్డేట్ చేయకపోతే ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మీ కంప్యూటర్ లేదా ఫోన్ లోకి ప్రవేశించి పూర్తిస్థాయి కంట్రోల్ పొందే అవకాశం ఉంది. దాదాపు ప్రతి సాఫ్ట్వేర్‌లోనూ ఎప్పటికప్పుడు ఇలాంటి కీలకమైన లోపాలు బయటపడుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటే సరిపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇతర బ్రౌజర్ లతో పోలిస్తే తాజా గణాంకాల ప్రకారం 63.7 శాతం వాటాను Google Chrome కలిగి ఉంది. అంటే వినియోగదారులు దీనిని ఎంత విస్తృతంగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Filed Under: Tech News Tagged With: chrome android, computer security, google chrome, google chrome update security flaws, google chrome windows, phone security

Whatsappలో ఇక మీ ఛాట్ సీక్రెట్ ఏం కాదు!

by

Whatsapp Facebook Messenger end to end encryption

ఇప్పటివరకు Whatsapp, Facebook Messenger వంటి వివిధ రకాల ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్స్ ద్వారా ఛాట్ చేసుకున్న సంభాషణలు పటిష్టమైన end-to-end encryption ఉండటం వల్ల కేవలం ఆ ఇద్దరు వ్యక్తులకు తప్పించి ఇతరులకు తెలిసేది కాదు. ఇటీవల ముంబై మాదక ద్రవ్యాల కేసులో కూడా Google Driveలో స్టోర్ అయ్యే ఛాట్ బ్యాకప్స్ ఆధారంగా కీలకమైన వివరాలు సేకరించారు తప్పించి నేరుగా ఛాట్‌ని యాక్సెస్ చెయ్యడం సాధ్యపడదు.

ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టెంట్ మెసెంజర్ అప్లికేషన్స్ వల్ల నేర పరిశోధనకు చాలా ఇబ్బందిగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిపై కంపెనీల పై ఒత్తిడి తీసుకురావాలని ఒక తాటిపై నడుస్తున్నాయి. Five Eyes పేరిట ఇండియా, జపాన్, US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్న WhatsApp, Telegram, Instagram, Facebook Messenger వంటి వివిధ రకాల అప్లికేషన్స్‌లో అమలుపరచబడుతున్న ఎన్‌క్రిప్షన్‌లో నేల పరిశోధనకు కీలకమైన సమాచారం అందించే విధంగా బ్యాక్ డోర్ కల్పించమని టెక్నాలజీ కంపెనీలను డిమాండ్ చేస్తున్నాయి.

వినియోగదారుల ప్రైవసీ మరియు భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూనే, మరోపక్క అతికీలకమైన నేరపరిశోధన కూడా సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆ కూటమి భావిస్తోంది. చాలా సందర్భాలలో టెక్నాలజీ కంపెనీలు వినియోగదారుల ప్రైవసీ గురించి మాట్లాడుతూ నేర పరిశోధనకు సహకరించడం లేదు అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. దీనివల్ల క్రమేపీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వివిధ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ తాజా కూటమి తీసుకు రాబోతున్న ఒత్తిడి వల్ల బ్యాక్ డోర్ కనుక కల్పించినట్లు అయితే భవిష్యత్తులో కొన్ని సందర్భాలలో ఈ సదుపాయం దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి మార్గాలను నిబద్ధతతో అమలు పరచాల్సిన బాధ్యత వివిధ దేశాల ప్రభుత్వాలపై ఉంటుంది.

Filed Under: Tech News Tagged With: cyber crimes, end to end encryption, phone privacy, phone security, Whatsapp Facebook Messenger end to end encryption, whatsapp security

మీ వాయిస్, మీ నెంబర్‌తో ఇతరులకి ఇలా phone calls వెళతాయి – సరికొత్త సైబర్ క్రైమ్!

by

increasing cyber crimes with call spoofing and deek fakes audio

ఇటీవల కాలంలో అనేక సరికొత్త సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. సైబర్ నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో అందరి కంటే ముందంజలో ఉంటున్నారు.

వాస్తవానికి మన “కంప్యూటర్ ఎరా” ప్రింటెడ్ పత్రికలో 2016లో కాల్ స్ఫూఫింగ్ టెక్నాలజీ గురించి వివరించడం జరిగింది. సరిగ్గా అదే టెక్నాలజీ ఆధారంగా గత సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలు జరిగాయి. మాజీ సీఎం పర్సనల్ అసిస్టెంట్‌నంటూ ఆ PA నెంబర్‌తో అనేక మంది ప్రముఖులు ఫోన్స్ చేసి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటనలు కొంత మందికి గుర్తుండే ఉంటాయి.

ఈ phone call spoofing టెక్నిక్ ద్వారా కేవలం మీ నెంబర్ తెలిస్తే చాలు.. ఒక సైబర్ నేరస్థుడు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అవతలి వ్యక్తి ఫోన్ స్క్రీన్ మీద అతని నెంబర్ కి బదులుగా మీ నెంబర్ కనబడే విధంగా మార్పిడి చేసి నేరానికి పాల్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం నెంబర్ లు మాత్రమే మార్చడానికి అనువుగా ఉన్న ఈ కాల్ స్ఫూఫింగ్ టెక్నాలజీకి ఇప్పుడు deepfakes audio అనే టెక్నాలజీ కూడా జత చేరింది. Deep Fakes టెక్నాలజీ ఇంతవరకు కేవలం వీడియో విషయంలో మాత్రమే లభిస్తూ ఉండేది. ఇప్పుడు ఎవరి ఆడియో అయిన సులభంగా deep fake చేసే వెసులుబాటు ఉండడంతో సరికొత్త ప్రమాదాలు వచ్చిపడ్డాయి.

ఈ టెక్నాలజీ ద్వారా మొట్టమొదట మీరు మాట్లాడిన మాటలతో కూడిన ఒక చిన్న ఆడియో క్లిప్ లభిస్తే చాలు. దానిని మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే deep fake audio టెక్నాలజీ విశ్లేషించి, ఒక వాయిస్ మోడల్ తయారుచేసుకుని.. ఇకమీదట మీరు మాట్లాడని మాటలు కూడా ఆటోమేటిక్ గా మాట్లాడే విధంగా ఆడియో ఫైల్ తయారు చేస్తుంది. ఇప్పుడు నేరస్థుల పైన చెప్పబడిన కాల్ స్ఫూఫింగ్ టెక్నాలజీ ఆధారంగా మీ ఫోన్ నెంబర్ కనపడే విధంగా చేసి, VoIP టెక్నాలజీ సహాయంతో మనిషి మాట్లాడకుండా ఇంతకుముందు సిద్ధంగా లభించిన నకిలీ ఆడియో ఫైల్ ప్లే చేస్తారు. అవతల ఉన్న వ్యక్తి నిజంగా మీరే మాట్లాడుతున్నారు అనే అపోహలో ఉంటారు.

రాబోయే రెండు మూడేళ్ల కాలంలో ఇలా ఒక పక్క మీ వాయిస్ క్లోనింగ్ చేసి, మరోపక్క మీ ఫోన్ నెంబర్ కూడా అవతల వారికి కల్పించే విధంగా చేసి సైబర్ నేరాలకు పాల్పడే వారు ఎక్కువ అవుతారు, కాబట్టి phone calls విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

Filed Under: How-To Guide Tagged With: cyber crime, cyber crime awarenesss, increasing cyber crimes with call spoofing and deek fakes audio, phone security

ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ Whatsapp స్కామ్‌తో జాగ్రత్త!

by

Navratri 2020 employment scam whatsapp

Whatsapp ఈ మధ్యకాలంలో స్కామ్‌లకి అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా ఏదైనా సీజన్ వస్తోందంటే చాలు, అమాయకులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు.

తాజాగా నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఒక స్కామ్ Whatsapp ద్వారా సర్క్యులేట్ అవుతోంది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం నవరాత్రి 2020 సందర్భంగా ప్రత్యేకంగా రోజ్గార్ యోజన ఎంప్లాయిమెంట్ స్కీం మొదలు పెడుతోందని, అందులో వెంటనే రిజిస్టర్ చేసుకోమని ఒక లింకు తో కూడిన వాట్స్అప్ మెసేజ్ వైరల్గా సర్క్యులేట్ అవుతోంది.

నిరుద్యోగులుగా ఉన్న వారు ఆ లింక్ ని క్లిక్ చేసి తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని, మీకు smartphone ఉన్నట్లయితే రోజుకు వెయ్యి రూపాయల నుండి 2000 రూపాయల వరకు సంపాదించవచ్చని, అక్టోబర్ 20వ తేదీలోపు అప్లై చేసుకోవాలని ఈ మెసేజ్ సారాంశం. “కంప్యూటర్ ఎరా” ఈ లింక్‌లను లోతుగా పరిశీలించగా.. ఆ లింకు క్లిక్ చేసినప్పుడు వెంటనే youtubegifts అనే ఓ డొమైన్‌ ఓపెన్ అవుతుంది. అందులో మోదీ ఫోటోతో పాటు, రిజిస్టర్ చేసుకోవడానికి మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని ఫీల్డ్‌లు కనిపిస్తాయి. వాటిని ఎంటర్ చేసి submit కొట్టిన వెంటనే, తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అంటే Whatsapp, Telegram ద్వారా మరికొంతమందికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయమని ఒక స్క్రీన్ వస్తుంది.

నిజంగానే వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే మాత్రమే తమ అప్లికేషన్ పరిగణించబడుతుంది అన్న భ్రమలో చాలామంది రెండో ఆలోచన లేకుండా దీనిని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ కారణం చేతే ఈ స్కామ్ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం కోసం సైబర్ నేరస్తులు వేసిన కొత్త సరికొత్త ఎత్తుగడ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మీ వివరాలు దీంట్లో ఇవ్వకండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీని గురించి హెచ్చరిక కూడా ప్రజలకు జారీ చేసింది.

Filed Under: How-To Guide Tagged With: Navratri 2020 employment scam whatsapp, phone security, whatsapp precautions, whatsapp scam

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 8
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in