• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

photo

Huawei తన ఫోన్ విషయంలో తప్పు చేసింది.. క్షమాపణ చెప్పింది!

by

camera

తాము రిలీజ్ చెయ్యబోయే కొత్త smartphoneల గురించి రకరకాల sample images విడుదల చేసి.. హడావుడి సృష్టించడం smartphone కంపెనీలకు అలవాటే. అయితే తమ ఫోన్ క్వాలిటీ అలా ఉంటుందనీ, ఇలా ఉంటుందనీ వాస్తవాల్ని చెప్తే బానే ఉంటుంది. అలా కాకుండా అబద్ధాలు చెప్తే వినియోగదారులు ఊరుకుంటారా?

Huawei phone తయారీ కంపెనీ తాను విడుదల చెయ్యబోతున్న Huawei P9 మోడల్ ఫోన్ cameraతో షూట్  చేసినట్లు ఆ సంస్థ Google+ పేజీలో ఓ ఫొటోని గర్వంగా share చేసింది. ఈ కెమెరాలో Leica-certified rear camera అనే సరికొత్త rear camera ఉన్నట్లు చెప్పుకుంటూ ఉంది.ఆ ఫొటోకి కేప్షన్‌గా Huawei సంస్థ ఇలా రాసుకుంది..

“We managed to catch a beautiful sunrise with Deliciously Ella. The #HuaweiP9’s dual Leica cameras makes taking photos in low light conditions like this a pleasure. Reinvent smartphone photography and share your sunrise pictures with us. #OO.”

ఆ ఫొటోని పరిశీలనగా చూస్తే focus, color level, sharpness, pixel details వంటివి చాలా అద్భుతంగా ఉన్నట్లు అర్థమవుతోంది. Huawei P9 ఫోన్‌తో ఇంత నాణ్యంగా ఫొటోలు షూట్ చేసుకోవచ్చు కాబోలని చాలామంది ఆశ్చర్యపోతారు కూడా!

అయితే ఈ ఫొటోని download చేసుకుని దాని EXIF dataని పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెల్లడైంది. P9 ఫోన్ కెెమెరాతో షూట్ చేసినట్లు చెప్పబడుతున్న ఆ ఫొటో వాస్తవానికి Canon EOD 5D DSLR కెమెరాతో షూట్ చెయ్యబడినట్లు EXIF Dataలో తెలుస్తోంది. ఈ భండారం బయటపడిన తర్వాత Huawei ఆ ఫొటోని తొలగించడమే కాకుండా యూజర్లకి క్షమాపణ చెబుతూ ఓ స్టేట్‌మెంట్‌ని క్రింది విధంగా విడుదల చేసింది..

“It has recently been highlighted that an image posted to our social channels was not shot on the Huawei P9. The photo, which was professionally taken while filming a Huawei P9 advert, was shared to inspire our community. We recognize though that we should have been clearer with the captions for this image. It was never our intention to mislead. We apologize for this and we have removed the image”

కెమెరా క్వాలిటీల గురించి smartphone కంపెనీలు అబద్ధాలు చెప్పడం ఇది కొత్త కాదు. గతంలో Nokia సంస్థ తన Lumia 920 ఫోన్ మోడల్ విషయంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారం చేసింది. ఒక కొత్త ఫోన్‌ని కొనేటప్పుడు ఎక్కువమంది ఆలోచించేది మంచి camera ఉందా లేదా అన్నది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫోన్ తయారీ సంస్థలు ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్నాయి.

Filed Under: Tech News Tagged With: camera, camera quality, gadget, huawei p9, photo, smartphone

ఇలా Selfies తీస్తే ఇక అంతే..!!

by

selfies

Selfie పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం అలుపెరగకుండా ఒకటికి పది ఫొటోలు phone front cameraతో కేప్చర్ చేస్తున్నారా? సెల్ఫీలు విపరీతంగా తీయడం smartphone స్క్రీన్ కాంతి మొహం మీద పడి చర్మంపై ముడతలుపడతాయని ఇటీవల వెల్లడైంది గుర్తుంది కదా. తాజాగా Selfieలతో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.

అదే పనిగా Selfieలను  కేప్చర్ చేసే వారికి Selfie Elbow అనే సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు నిర్థారణకు వచ్చారు. టెన్నిస్ ఎల్‌బో, గోల్ఫర్ ఎల్‌బో వంటి వాటి గురించి మనకు ఇప్పటికే తెలిసిందే. అయితే selfie కేప్చర్ చెయ్యడం కోసం మనం చేతిని పైకి తిప్పి ఓ అసౌకర్యకరమైన స్థితిలో అదే పనిగా పెట్టడం వల్ల ఈ Selfie Elbow సమస్య పెరిగిపోతుంది.

సెల్ఫీ కోసం ప్రయత్నించేటప్పుడు.. అదీ ఒకటికి పది ఫొటోలు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనకు తెలీకుండానే మజిల్ మీద వత్తిడి పడుతుంది. ఆ కండరం ఎముక నుండి విడిపడిపోయి నొప్పి, వాపులకు కారణం అవుతుంటుంది.

Selfie Elbow నుండి ఉపశమనం కోసం తాత్కాలికంగా నొప్పి నివారణ మందులు వాడడం, ఐస్‌తో కాపడం పెట్టడం, కండరాలను సాగదీస్తూ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చెయ్యడం మంచి ఫలితాలను ఇస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా selfie elbow సమస్య చాపక్రింద నీరులా విస్తరిస్తోందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే పనిగా చేతుల్ని అసహజ భంగిమల్లో అమర్చుకుని సెల్ఫీలను తీయడం వల్ల selfie elbowతో పాటు మణికట్టు ప్రాంతంలో photosని కేప్చర్ చెయ్యడానికి మనం వాడే బొటనవేలు అమర్చే కోణంపై కూడా వత్తిడి పడి ఇబ్బంది తలెత్తుతున్నట్లు తేలింది. చాలా సందర్భాల్లో selfie stick లను వాడడం వల్ల ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు.

Technology చాలా విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న విషయలు ఇటీవల వెలుగు చూస్తున్న వైద్య పరిశోధనల ద్వారా అర్థమవుతూ ఉంది. అయితే ఏది ఎంతమేరకు వాడాలో సరైన అవగాహన కలిగి ఉండి ఏదీ శృతి మించకుండా చూసుకోగలిగితే అటు latest technologyని వాడుకోగలుగుతూనే, ఇటు ఆరోగ్యాన్నీ కాపాడుకోగలుగుతాం.

Filed Under: Tech News Tagged With: android, camera, front camera, gadgets, health issues, photo, selfie, smartphone, technology

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in