
నిన్న భారతీయ మార్కెట్లో Xiaomi సంస్థ Redmi 8A ఫోన్ విడుదల చేసింది. 6,499 రూపాయలకు విక్రయించబడుతున్న ఈ ఫోన్ గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం.
డిజైన్
బడ్జెట్ వినియోగదారుల కోసం రూపొందించబడిన Redmi 8Aలో USB Type-C పోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తున్నాయి. డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ నిశితంగా చూసినప్పుడు ఇది బడ్జెట్ ఫోన్ అని భావించడం కష్టం. Xiaomi సంస్థ డిజైన్ పరంగా మంచి వర్క్ చేసిందనే చెప్పుకోవాలి. 6.22 అంగుళాల డిస్ప్లేతో, స్క్రీన్ పై భాగంలో waterdrop notchని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇయర్ పీస్ ఫోన్ అంచుల వద్ద మార్చబడింది.
చేతిలో పట్టుకోవడానికి అనువుగా ఉండేవిధంగా Redmi 8A అంచుల వద్ద కర్వ్‌డ్ డిజైన్ ఉపయోగించబడింది. ఇంతకు ముందు విడుదల చేయబడిన Redmi 7Aలో కేవలం 5.45 అంగుళాల డిస్ప్లే మాత్రమే ఉండగా, తాజాగా ఈ ఫోన్ లో మాత్రం ఏకంగా 6.22 అంగుళాల డిస్ప్లే ఉండడం గమనార్హం. 720x 1440 pixels రిజల్యూషన్ కలిగిన హెచ్డి ప్లస్ డిస్ప్లే తో, గొరిల్లా గ్లాస్ 5 చేత ఈ ఫోన్ రక్షించబడుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ 6499 రూపాయలకు లభిస్తుంది. అలాగే 3జీబి ర్యామ్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ 6,999 రూపాయలకు లభిస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
ఇతర సదుపాయాలు
రెండు నానో-sims, ప్రత్యేకంగా మెమరీ కార్డు సపోర్ట్ ఇది కలిగి ఉంటుంది. బ్లూటూత్ 4.2, వైఫై, ఎఫ్ఎం రేడియో సదుపాయం కూడా దీంట్లో ఉంటాయి. సాఫ్ట్వేర్ పరంగా చూస్తే ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే MIUI 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్ లో లభిస్తుంది. దాదాపు అన్ని రకాల Xiaomi phoneలలో కనిపించే విధంగా అదే విధమైన యూజర్ ఇంటర్ఫేస్ను ఇంట్లో కూడా ఉంటుంది అదే విధమైన యూజర్ ఇంటర్ఫేస్ దీంట్లో కూడా ఉంటుంది. అలాగే ఫోన్ తో పాటు పేటీఎం, అమెజాన్, ఫేస్బుక్ వంటి అనేక రకాల అప్లికేషన్స్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటున్నాయి. ఈ ఫోన్ లో ఎలాంటి అప్లికేషన్ డ్రాయర్ లేకపోవడం వలన అన్ని అప్లికేషన్స్ హోమ్స్క్రీన్ లోనే కనిపిస్తాయి.
మిగతా 2వ పేజీలో..