
మొదటి నుండి Redmi Note సిరీస్ ఫోన్లు భారతీయ మార్కెట్లో బాగా హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయి. అదే ఒరవడి Redmi Note 8 Pro విషయంలో కూడా కొనసాగుతూ వచ్చింది. 20 వేల రూపాయల లోపు ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫోన్ కూడా ఒక ఛాయిస్ గా నిలుస్తోంది.
మెరుగైన బిల్డ్ క్వాలిటీ, పెద్ద పరిమాణం కలిగిన స్క్రీన్ మాత్రమే కాకుండా, గేమింగ్ కోసం ఉద్దేశించబడిన శక్తివంతమైన chipset కూడా దీని ప్రత్యేకత. ఈ నేపథ్యంలో Redmi Note 8 Pro ఫోన్ ధరని ఆ సంస్థ శాశ్వతంగా అన్నీ మోడల్స్ మీద వెయ్యి రూపాయల వరకు తగ్గించింది. 6 జి బి రామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ 14999 రూపాయలకు బదులుగా ప్రస్తుతం కేవలం 13999 రూపాయలకు లభిస్తోంది. మరోవైపు 6 జిబి ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మరో మోడల్ 15999 రూపాయలకు, 8 జీబీ ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 17999 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు.
దీంతోపాటు 6 జి బి రామ్ మోడల్ మీద వెయ్యి రూపాయల వరకు ఎక్స్చేంజి డిస్కౌంట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది. 13999 రూపాయల ధరకు కచ్చితంగా ఇంత కన్నా మెరుగైన ఫోన్ లభించదు. మీడియా టెక్ హీలియో G90T ప్రాసెసర్, ప్రీమియం రూపం కలిగి ఉండే విధంగా గ్లాస్ బిల్డ్, గ్రేడియంట్ కలర్స్ వంటి అనేక రకాల ప్రత్యేకతలను ఇది కలిగి ఉంటుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వీడియోలను చూడడానికి చాలా అనువుగా ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ మ్యాక్రో కెమెరా ఫోన్ వెనుక భాగంలో లభిస్తున్నాయి. అయితే కొద్దిగా అదనపు ధర పెట్టగలిగితే 15999 రూపాయల ధరకు Poco X2 మెరుగైన ఛాయిస్ గా నిలుస్తుంది. దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 24 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా లభిస్తాయి.