
మొదట్లో అందిన సమాచారం ప్రకారం, Redmi Note 7 ఫోన్ భారతీయ మార్కెట్లో రేపు, అంటే ఫిబ్రవరి 12న విడుదల కావాల్సి ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా redmi note 5 విడుదల కావడం కూడా దీనికి బలం చేకూర్చింది.
అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా Redmi Note 7 మార్చి నెలకు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో Redmi Note 7 భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. ఇక మిగతా స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే ఇందులో 6.3 అంగుళాల Full HD+ IPS LCD డిస్ప్లే తో పాటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 చేత స్క్రీన్ రక్షించబడుతుంది.
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ సుమారు 11,999 రూపాయలకు, 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ సుమారు 13,999 రూపాయలకు, 6GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ సుమారు 15,999 రూపాయలకు లభించే అవకాశం ఉంది.
ఇకపోతే ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు 5 మెగా పిక్సెల్ depth sensor కూడా లభిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 20 megapixel సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ తో Quick Charge 4.0 సపోర్టు ఇది కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పని చేసే అవకాశం ఉంది.