
Android Phoneలను వాడేటప్పుడు ఇతరులు ఫోన్లోకి ప్రవేశించకుండా PIN, Patternలతో పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ లాంటివి వచ్చినా కూడా వాటి కంటే ముందు తప్పనిసరిగా PIN సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు PIN గానీ, pattern గానీ మర్చిపోతే దాన్ని రీసెట్ చేయటం ఇలా!
Android SDK ద్వారా!

ఈ టెక్నిక్ పనిచేయాలంటే మొట్టమొదట మీ ఫోన్ లో Developer Options గతంలో ఎనేబుల్ చేయబడి ఉండి, అందులో USB Debugging కూడా ఎనేబుల్ చేయబడి ఉండాలి. ఆ తర్వాత మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్‌లోకి Android SDKని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డేటా కేబుల్ సాయంతో మీ phoneని PCకి కనెక్ట్ చేయండి. ఆ తర్వాత Android SDK ఇన్స్టాల్ అయి ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్లి Tools అనే ఫోల్డర్‌లోకి వెళ్లండి. అందులో ఉండగా కీబోర్డు మీద Shift కీ ప్రెస్ చేసి, మౌస్‌తో ఖాళీ ప్రదేశంలో రైట్ క్లిక్ చేసి, Open command window here అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో ఒక కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ..
ADB shell rm /data/system/gesture.key అనే కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం విజయవంతంగా పూర్తయితే, ఆ తర్వాత డేటా కేబుల్ తొలగించి మీ ఫోన్ రీస్టార్ట్ చేస్తే పిన్ ఏమి అడగకుండానే లోపలికి వెళ్ళి పోతుంది.
రికవరీ మెనూ ద్వారా!

మనం వాడే ప్రతి Android phoneకి రికవరీ మోడ్ అని ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వాడే ఫోన్ మోడల్ ని బట్టి దాంట్లో ఎలా వెళ్లాలో Googleలో వెదికి పట్టుకోండి. ఉదాహరణకు కొన్ని ఫోన్లలో, ఫోన్ ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు Power, Volume Up బటన్లని 10 సెకన్లపాటు పట్టుకుంటే ఈ రికవరీ మోడ్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో కి వెళ్లి అక్కడ స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లను Volume Up, Volume Down కీలను అవసరాన్ని బట్టి నొక్కడం ద్వారా ఎంపిక చేసుకోవాలి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్.. Wipe data/factory reset అనేది. Volume buttonలతో దాన్ని సెలెక్ట్ చేసుకొని, చివరిగా Power బటన్ ప్రెస్ చేస్తే ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయబడుతుంది. దాంతోపాటు పిన్ కూడా పోతుంది. అయితే ఈ పద్ధతి ద్వారా ఫోన్ లో అప్పటికే ఉన్న డేటా మొత్తం పోతుంది, మెమరీ కార్డు లో డేటా మాత్రం అలాగే ఉంటుంది.
Android Device Manager ద్వారా

ఈ లింకు నుండి మీ కంప్యూటర్ లో గానీ, లాప్టాప్ లో గానీ, వేరే ఫోన్ లో గానీ Android Device Managerలోకి వెళ్లండి. అక్కడ మీ గూగుల్ అకౌంట్ తో రిజిస్టర్ చేయబడి ఉన్న వివిధ రకాల డివైజ్ల వివరాలు కనిపిస్తాయి. మీరు PIN reset చేయాలనుకుంటున్న మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకొని Lock అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రీసెట్ చేయొచ్చు. ఇక్కడే Erase అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంపిక చేసుకోకండి. దానివల్ల మీ ఫోన్లో డేటా మొత్తం పోతుంది.