Selfieల పట్ల మోజు ఎన్ని ప్రాణాలను తీస్తోందో ఈమధ్య తరచూ వేర్వేరు సంఘటనల్లో వింటూనే ఉన్నాం. అయినా యువతరంలో మార్పు రావడంలేదు.
ఈరోజు ఢిల్లీలో జరిగిన సంఘటన మరీ దారుణమైంది. ఓ 17 ఏళ్ళ కుర్రాడు లోడ్ చెయ్యబడి ఉన్న గన్ చేతిలో పట్టుకొని సెల్ఫీ తీసుకుంటూ పొరబాటున 25 ఏళ్ల తన కజిన్‌నే కాల్చేశాడు. దాంతో అతను చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ స్కూల్ టీచర్ ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు.
సాయంత్రం 5:30 సమయంలో చేతిలో గన్ పట్టుకొని 17 సంవత్సరాల అతని కజిన్ selfie తీసుకుందామని ప్రయత్నించే సమయంలో phoneలో క్యాప్చర్ బటన్ press చేయబోయి, చేతిలో ఉన్న గన్ ట్రిగ్గర్‌ని నొక్కేశాడు. దాంతో బుల్లెట్ చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తి శరీరంలోకి దూసుకువెళ్లి చనిపోయాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లినా లేకుండా పోయింది.
ఢిల్లీ లో ఉంటున్న ఆ 17 సంవత్సరాల కుర్రాడి తండ్రి రియల్ ఎస్టేట్ డీలర్ అవడంతో అతనికి గన్ లైసెన్స్ ఉంది. అయితే జాగ్రత్తగా ఉంచవలసిన గన్‌ని తన కుమారుడు వాడుకోవడానికి ఇచ్చినందుకుగాను అతని తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు, అలాగే ఆ మైనర్ కుర్రాడ్ని కూడా అరెస్టు చేశారు.
2014 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 213 సెల్ఫీ మరణాలు సంభవించాయి. ఇప్పటికైనా సెల్ఫీ ల పట్ల, ముఖ్యంగా ప్రమాదకరమైన ఫోజుల్లో సెల్ఫీలు తీసుకోవడం పట్ల జాగ్రత్త వహించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.