• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

smartphone technology

ఈ కొత్త ఆప్షన్‌తో మీ phoneలో games చాలా ఫాస్ట్ గా ఉంటాయి!

by

Xiaomi RAMDISK Trial Mode for fast gaming

Smartphoneలపై గంటల తరబడి శక్తివంతమైన గేమ్స్ ఆడే వారు ఈ మధ్య కూడా ఉంటున్నారు. ప్రత్యేకంగా గేమ్స్ ఆడుకోవడం కోసమే మెరుగైన స్పెసిఫికేషన్స్, గ్రాఫిక్ ప్రాసెసర్‌తో ఫోన్స్ విడుదల చేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్స్ మరింత వేగంగా ఉండేలా Xiaomi సంస్థ ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది.

Windows డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టం వాడే వారికి చాలా కాలం నుండి వర్చ్యువల్ మెమరీ అనే పదం తెలిసే ఉంటుంది. మీ హార్డ్ డిస్క్ లో ఉండే కొంత ప్రదేశాన్ని VRAMగా వాడుతూ కంప్యూటర్ పనితీరు మెరుగు పరచడం ఈ టెక్నాలజీ ఉద్దేశం. దాదాపు అదే రకమైన టెక్నాలజీని ఇప్పుడు Xiaomi సంస్థ స్మార్ట్ ఫోన్లకి తీసుకొచ్చింది. RAMDISK అని పిలువబడే ఈ టెక్నాలజీ మొట్టమొదట Mi 10 Ultra ఫోన్లో నిక్షిప్తం చేస్తున్నారు.

ఈ ఫోన్లో ఉండే 16GB RAM ఒక ప్రత్యేకమైన మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు స్టోరేజ్‌గా పనిచేస్తుంది. సహజంగా ఏదైనా గేమ్ phone internal storageలో ఇన్స్టాల్ చేసినప్పుడు, ఆ ఇంటర్నల్ స్టోరేజ్ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్లో ఎంత ర్యామ్ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు, గేమ్ నెమ్మదిగానే ప్లే అవుతుంది. అయితే దీనికి భిన్నంగా ఈ సరికొత్త RAMDISK టెక్నాలజీ పనిచేస్తుంది.

RAMDISK Trial Modeని ఎనేబుల్ చేసినప్పుడు మీకు కావలసిన గేమ్ మీ ఫోన్ లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ లోకి కాకుండా నేరుగా ర్యామ్‌లో ఇన్స్టాల్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ర్యామ్ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి గేమ్ కూడా వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఈ టెక్నాలజీ ఆధారంగా Peace Elite అనే గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు, కేవలం అది 10 సెకండ్స్ లో ఇన్స్టాల్ అయింది. మామూలుగా అయితే దీనికోసం ఒకటిన్నర నిమిషం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా నేరుగా ర్యామ్‌లో ఇన్స్టాల్ చేయబడిన గేమ్ కేవలం అంతసేపు ఆడుకోడానికి మాత్రమే బాగుంటుంది కానీ, ఒకవేళ మీ ఫోన్ రీస్టార్ట్ అయిన గానీ, బ్యాటరీ అయిపోయినా గానీ.. అది శాశ్వతంగా ఉండదు, మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతం కేవలం Mi 10 Ultra ఫోన్లో మాత్రమే లభిస్తున్న ఈ RAMDISK టెక్నాలజీ త్వరలో మిగిలిన Xiaomi phoneలు అన్నిటికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా ఫోన్ తయారీ సంస్థలు కూడా సరిగ్గా ఇలాంటి టెక్నాలజీ కాస్త అటూ ఇటుగా తీసుకొస్తాయి.

Filed Under: How-To Guide Tagged With: gaming phone, Mi 10 Ultra, smartphone technology, Xiaomi, Xiaomi RAMDISK Trial Mode for fast gaming

Phoneలలో Curved Screen ఉపయోగాలు, నష్టాలేంటి?

by

curved screen phone

నిన్న మొన్నటి వరకూ Samsung phoneలకే పరిమితం అయిన Curved Screen టెక్నాలజీ ఈ మధ్య మెల్లగా అనేక ఇతర కంపెనీల phoneలకి రాబోతోంది. పలు సంస్థలు తమ రాబోయే flagship phoneలలో curved screenలు వాడబోతున్నాయి. ఈ నేపధ్యంలో అసలు curved screen వల్ల ఉపయోగాలూ నష్టాలూ చూద్దాం.

Curved Screen phone ఉపయోగాలు

ఫ్లాట్ స్క్రీన్ phone కన్నా curved screen phone చూడడానికి ఆకర్షణీయంగా, ఇంకా చెప్పాలంటే సెక్సీగా ఉంటుంది.  వ్యక్తిగతంగా నేను గత మూడేళ్లుగా Samsung Galaxy S6 Edge+, Galaxy S8+ ఫోన్లని వాడుతున్నాను. సినిమా థియేటర్‌కి వెళ్లినా, బయట ఎక్కడకు వెళ్లినా, అందరి దృష్టీ నా phone మీద ఖచ్చితంగా పడుతుంది.

స్క్రీన్ edge మీద నోటిఫికేషన్లు, టైమ్, twitter, yahoo news వంటి వివిధ అలర్టులు, ఇంకా అనేక అంశాన్ని చూసే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వీడియోలు, సినిమాలు చూసేటప్పుడు curved screen వల్ల 3D ఫీలింగ్ కలిగి మనం ఆ ప్రదేశంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.  Curved screenల వల్ల వ్యూయింగ్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుంది. Curved Screen phoneల విషయంలో చేతికి గ్రిప్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది.

అయితే స్వయంగా చాలా కాలంపాటు Samsung Galaxy S6 Edge+, S8+ curved screen phoneలను వాడిన తర్వాత నాకు కొన్ని అసౌకర్యాలు అర్థమయ్యాయి. Facebook, Whatsapp వంటి చాలా appsలో మెనూలు ఎడమచేతి వైపు గానీ, కుడిచేతి వైపు గానీ చివర్న ఉంటాయి. వాటిని ఎంచుకోవాలంటే తప్పనిసరిగా edge మీద tap చేయాల్సిందే. సో డిస్‌ప్లే curvedగా ఉండడం వల్ల చాలాసార్లు రెండు మూడు సార్లు tap చెయ్యాల్సి వచ్చింది.

వాస్తవంగా flat screen displayతో పోలిస్తే curved screen displayలో స్క్రీన్ ఏరియా తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం భ్రాంతి మాత్రమే.

Filed Under: How-To Guide Tagged With: smartphone technology

Primary Sidebar

Recent Posts

  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!
  • మీ Android phoneలో డిలీట్ అయిన డేటా తిరిగి పొందటానికి మెథడ్స్

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in