• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

tech tips

5GB వరకూ సైజ్ ఉన్న ఫైళ్లు చాలా ఈజీగా మెయిల్ ద్వారా పంపించడం ఇలా!

by

How to send 5GB files through email

Gmail వంటి ఈ మెయిల్ సర్వీస్‌లు కేవలం 25mb వరకు మాత్రమే మెయిల్ అటాచ్మెంట్ పంపడానికి అవకాశం కల్పిస్తాయి. అయితే గూగుల్ డ్రైవ్ వాడటం ద్వారా, భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను send చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది మీకు లభిస్తున్న ఉచిత గూగుల్ స్టోరేజ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇకమీదట భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను ఇతరులకు పంపించటం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. గరిష్టంగా 5 జీబీ వరకూ అభిమానం కలిగిన ఫైళ్లను మీ స్నేహితులకు పంపడం కోసం SendGB అనే ఉచిత సర్వీస్ లభిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. మీరు చేయవలసిందల్లా భారీ పరిమాణం కలిగిన ఫైళ్లను అప్లోడ్ చేయగలిగిన వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండటమే.

ఒక్కసారి ఈ వెబ్సైట్ లో పెద్ద ఫైళ్లను అప్ లోడ్ చేసిన తర్వాత, వెంటనే స్క్రీన్ మీద వచ్చే ఇంటర్ఫేస్ ద్వారా, మీరు ఎవరికి అయితే ఆ ఫైల్ పంపాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి మెయిల్ ఐడిని టైప్ చేసి, దాంతోపాటు కావాలంటే ఒక మెసేజ్ కూడా కంపోజ్ చేసి మెయిల్ పంపించవచ్చు. ఫైల్ యొక్క పరిమాణాన్ని బట్టి ఏడు రోజుల నుండి 90 రోజుల వరకు అది సర్వర్‌లో జాగ్రత్తగా భద్రపరచబడుతుంది.

ఇక్కడ అన్నిటికంటే గొప్ప విషయం.. రోజువారి ఎలాంటి పరిమితులు లేకుండా మీరు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ ఈ సర్వీసు ద్వారా మీకు కావలసిన వ్యక్తులకు షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కోరుకుంటే గనుక, అవతలి వ్యక్తి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా సంబంధిత ఫైల్ తొలగించబడే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సర్వీస్ లో ఎలాంటి పరిమితులు లేవు కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని మీ రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

Filed Under: How-To Guide Tagged With: email attachment, file sharing, How to send 5GB files through email, online service, sendGB, tech tips

ఇండేన్ గ్యాన్ ఉందా? అయితే మీ సిలెండర్ ఇక Whatsappలో బుక్ చేసుకోవచ్చు!

by

How to book Indane Gas cylinder through Whatsapp

గ్యాస్ అయిపోయిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం ఇబ్బందిగా ఉందా? అయితే ఇకమీదట అంత కష్టపడాల్సిన పనిలేదు. ఒక Whatsapp ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

నవంబర్ ఒకటో తేదీ నుండి ఇండేన్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనికోసం మీరు చేయవలసిందల్లా మొట్టమొదట మీ ఫోన్లో 7588888824 అనే నెంబర్‌ని మీకు గుర్తుండే పేరుతో సేవ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లో మాత్రమే ఈ సదుపాయం వాడుకోటానికి సాధ్యపడుతుంది. నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత Whatsappలో పైన చెప్పబడిన నెంబర్కి REFILL అనే మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీ సిలిండర్ బుక్ అయిపోతుంది.

సిలిండర్ బుక్ చేసిన తర్వాత.. Delivery Authentication Code ఆధారంగా డెలివరీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ పద్ధతి ద్వారా మీరు సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీ ఫోన్ కి ఒక ఓటిపి వస్తుంది. గ్యాస్ డెలివరీ సమయంలో వచ్చిన వ్యక్తికి మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ తెలియజేస్తే మాత్రమే సిలిండర్ ఇవ్వబడుతుంది.

గ్యాస్ బుకింగ్ కోసం మీరు వాడుతున్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదా? లేదా వేరే నెంబర్ మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి దగ్గర ఉండే ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా.. అప్పటికప్పుడు మీరు వాడుతున్న వేరే మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెలివరీ పర్సన్ మొబైల్ అప్లికేషన్లో కొత్త నెంబర్ అప్డేట్ చేసిన వెంటనే ఇకమీదట కొత్త నెంబర్ మాత్రమే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గా కొనసాగుతుంది.

Filed Under: How-To Guide Tagged With: How to book Indane Gas cylinder through Whatsapp, Indane gas booking online, tech tips, whatsapp, whatsapp booking

మీ phoneలో అత్యంత ముఖ్యమైన Google Play Services గురించి తెలుసా?

by

Importance of Google Play Services in an Android phone

Android smartphoneలను ఉపయోగించే వినియోగదారులకు Google Play Services అనే అప్లికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గూగుల్ సంస్థ చేత నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ చెయ్యబడే సర్వీస్ ఇది.

గూగుల్ ప్లే సర్వీసెస్ ఎందుకు ఉపయోగం?

మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేయబడి ఇన్స్టాల్ చేయబడిన వివిధ రకాల అప్లికేషన్స్ మరియు గేమ్స్‌ని గూగుల్ సంస్థకు చెందిన కీలకమైన సర్వీసులకు అనుసంధానం చేయడం కోసం ఉపయోగించే సర్వీస్‌గా Google Play Servicesని భావించవచ్చు. ఉదాహరణకు మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పనిచేసే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉంది అనుకోండి. అంతెందుకు Ola క్యాబ్ బుకింగ్ అప్లికేషన్ ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. అది గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ గూగుల్ మ్యాప్స్ కి సక్రమంగా కనెక్ట్ కావాలంటే తప్పనిసరిగా మీ ఫోన్ లో గూగుల్ ప్లే సర్వీసెస్ నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి.

అంతేకాదు, Whatsappనే తీసుకుంటే, ప్రతిరోజు మీ ముఖ్యమైన బ్యాకప్ Google Driveలోకి బ్యాకప్ తీయబడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి. గూగుల్ ప్లే సర్వీసెస్ అనేది లేకపోతే, ఖచ్చితంగా వాట్సాప్‌కి, గూగుల్ డ్రైవ్ కి మధ్య కనెక్టివిటీ ఏర్పడదు.

Google Play Servicesని తొలగించవచ్చా?

మీ Android phoneలో గూగుల్ ప్లే సర్వీసెస్ అనేది అతి కీలకమైన అప్లికేషన్ కాబట్టి దానిని తొలగించటానికి గూగుల్ సంస్థ ఏమాత్రం అవకాశం కల్పించదు. గతంలో దీన్ని సెట్టింగ్స్ లో అప్లికేషన్స్ లోకి వెళ్లి డిసేబుల్ చేసుకోవడానికి సాధ్యపడేది. కానీ ఇప్పుడు అలాంటి సదుపాయాన్ని కూడా గూగుల్ పూర్తిగా ఎత్తేసింది.

బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది?

కొన్ని సందర్భాలలో తమ ఫోన్లో గూగుల్ ప్లే సర్వీసెస్ భారీ మొత్తంలో బ్యాటరీ ఖర్చు చేస్తోంది అంటూ అనేక మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి ప్రధాన కారణం గూగుల్ ప్లే సర్వీసెస్ కాదు. ఇంతకు ముందు చెప్పినట్లు Ola కానీ, Whatsapp గానీ, ఇతర గూగుల్ సర్వీసులను ఆధారంగా తీసుకొని పని చేస్తున్న మీ ఫోన్లోని అప్లికేషన్స్ గానీ లోపాలను కలిగి ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే గూగుల్ ప్లే సర్వీసెస్ ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తున్నట్లు బ్యాటరీ గణాంకాల్లో వెల్లడవుతుంది. అలాంటప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్ నిందించటం కాకుండా, దానికి కారణమవుతున్న ఇతర అప్లికేషన్లను గుర్తించి వాటిని తొలగించుకోవడం గానీ, తాత్కాలికంగా డిజేబుల్ చేయటం గానీ చేయాలి.

Filed Under: How-To Guide Tagged With: android facts, android phone, google play services, Importance of Google Play Services in an Android phone, tech tips

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in