• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

UPI payments

Whatapp Payments విషయంలో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త!

by

Whatsapp Payemnts frauds precautions

ఇటీవల అందుబాటులోకి వచ్చిన Whatsapp Payments సదుపాయాన్ని చాలా మంది ఇప్పటికే వినియోగించుకుంటున్నారు. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని అనేకమంది సైబర్ నేరస్తులు ఫ్రాడ్‌లకు పాల్పడుతున్నారు. మీరు చేసే ఒక చిన్న తప్పు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి కారణమౌతుంది. అందుకే ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.

Whatsapp Paymentsకీ, Whatappకీ ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ వుండదు. మీకు ఏదైనా లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు వేచి ఉంటే అది విజయవంతంగా పూర్తి అవ్వటం గానీ, లేదా మీ అకౌంట్ లోకి వెనక్కి డబ్బులు రావడం గానీ జరుగుతుంది. అంతే తప్పించి Google, Youtubeలలో Whatsapp Customer Care నెంబర్ అని వెదికితే అనేక నకిలీ ఫలితాలు కనిపిస్తాయి. అలాంటి నంబర్లకు కాల్ చేస్తే, ఈ అకౌంట్ కి డబ్బులు ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు.

Whatapp సంస్థ ఏ కస్టమర్ కి నేరుగా ఫోన్ చేయదు. ఒకవేళ ఎవరైనా మీకు వాట్సాప్ ప్రతినిధులుగా ఫోన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో బాబు అడిగిన ఎలాంటి వివరాలు చెప్పకండి. ముఖ్యంగా వాట్సప్ పేమెంట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలా వచ్చిన ఫోన్ కాల్స్ కి చాలామంది వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి కాల్స్ వెంటనే కట్ చేయండి.

మంచి బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన పనితీరు కలిగి, విపరీతంగా అమ్ముడుపోతున్న Samsung Galaxy M51 (Celestial Black, 6GB RAM, 128GB Storage) అసలు ధర 24,999 కాగా కేవలం 22,999కే పొందండి. SBI క్రెడిట్ కార్డ్ వాడే వారు మరో 2,500 తగ్గింపుతో కేవలం 20,499కే పొందొచ్చు. బెస్ట్ డీల్.. https://amzn.to/3ns2JRR

కొన్ని సందర్భాలలో మీ ఫోన్నెంబర్ తెలుసుకున్న సైబర్ నేరస్తులు Whatapp Payment Request పంపిస్తారు. తెలిసీ తెలీక ఒకవేళ మీరు దానిని ట్యాప్ చేసినట్లయితే వెంటనే సంబంధిత మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ అయిపోతుంది. కాబట్టి మీకు వచ్చిన మెసేజ్ పేమెంట్ రిక్వెస్టా, లేక పేమెంట్‌నా అన్న విషయం గమనించి దానికి తగ్గట్లుగా వ్యవహరించండి. ఇవి మాత్రమే కాదు, మీ Whataspp Payments UPI PINని గానీ, మీ Whatapp అకౌంట్‌‌కి సంబంధించిన ఓటిపిలను గానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో చేసుకోకండి. ఈ జాగ్రత్తలన్నీ అనుసరిస్తే కచ్చితంగా మీ Whatapp Payments అకౌంట్ సురక్షితంగా ఉంటుంది.

Filed Under: How-To Guide Tagged With: cyber crimes, internet banking, UPI payments, whatsapp, Whatsapp Payemnts frauds precautions, whatsapp payments

Google Pay ఇక మరింత సరికొత్తగా!

by

Google Pay new user interface

డిజిటల్ పేమెంట్స్ యాప్ అయిన Google pay పూర్తిగా తన రూపురేఖలు మార్చుకుని త్వరలోనే మన ముందుకి సరికొత్తగా రాబోతోంది. Google యొక్క స్వంత యూజర్ ఇంటర్ఫేస్ టూల్ కిట్ ఫ్లట్టర్ ద్వారా ఈ మార్పులు ఒకేసారి Android మరియు iOS వినియోగదారులకు అందించబోతోంది.

Google యొక్క ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా(Caesar Sengupta) మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఈ కొత్త మార్పులు గురించి వివరిస్తూ.. Google pay వినియోగదారుల కోసం ఇప్పుడు మరెన్నో కొత్త ఫీచర్స్ ని విడుదల చేయబోతోంది. ఇది బీటా ఛానెల్ తో ప్రారంభం అవుతుంది.
Google తన బ్లాగ్ పోస్ట్ లో ఈ కొత్త మార్పుల అవసరాన్ని చెప్తూ.. అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి తగ్గట్టు గా ఆధునిక సదుపాయాల తో పాటు మరింత ఆకర్షణీయం గా UI క్లీన్ గా ఉండే విధంగా మార్పులను అభివృద్ధి చేస్తోంది. అది కూడా కోడ్ ఒకసారి రాసి Android మరియు iOS ఫ్లాట్ఫారాలలో అమలులోకి తీసుకురావాలి అనుకుంటున్నట్లు పేర్కొంది.

కంపెనీ Google pay యొక్క మొత్తం కోడ్ ని మార్పు చేసి మరింత ఆకర్షణీయం గా తయారు చేసి కొత్త ఇంటర్ఫేస్ తో వినియోగదారుల ముందుకి త్వరలో తీసుకురాబోతుంది.
సింగపూర్ మరియు ఇండియాలోని వినియోగదారులు ఈ బీటా ఛానెల్ లోనీ మార్పులను గమనించవచ్చు.

ప్రపంచం లోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫైనాన్సియల్ టెక్నాలజీ ఆప్ గా Google pay అవతరించింది. ముఖ్యంగా ఇది భారతదేశంలో భారీగా వాడబడుతోంది. Google pay ప్రారంభించిన మూడు సంవత్సరాల్లోనే పాపులర్ అయ్యింది అని సేన్ గుప్తా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇండియాలో రైలు, రోడ్డు ద్వారా జరిగే చెల్లింపులను ప్రభావితం చేసే విధంగా Google pay UPI ద్వారా డిజిటల్ చెల్లింపులను అందజేస్తుంది. డిజిటల్ చెల్లింపులను అందజేయడానికి ఇది నాలుగు పెద్ద బ్యాంకులతో పనిచేయడంతో పాటు, బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. బ్యాంకులు,కొన్ని ఇతర ఆర్థిక సేవల నుండి రుణాలు అందిస్తుంది. Amazon pay, Paytm, Phone pay వంటి కంటే ఎక్కువ యూజర్ బేస్‌ని Google Pay కలిగి ఉన్న విషయం తెలిసిందే.

  • మాధవి పెద్దింటి

Filed Under: Tech News Tagged With: google pay india, Google Pay new user interface, online payments, UPI payments

Google Payలో కొత్తగా వచ్చిన సదుపాయం ఇది!

by

Google Pay NFC based payments debit credit cards

దేశవ్యాప్తంగా మొత్తం UPI లావాదేవీల్లో అధికశాతం Google Pay ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాతి స్థానంలో మాత్రమే PhonePe కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడం కోసం తాజాగా Google Pay ఒక కొత్త సదుపాయం తీసుకొచ్చింది.

NFC ఆధారంగా డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపులు జరిపే విధానం తాజాగా ప్రవేశపెట్టబడింది. లావాదేవీలు జరిపేటప్పుడు పూర్తిగా డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వివరాలు సమర్పించాల్సిన పనిలేకుండా కేవలం అప్పటికప్పుడు డిజిటల్ గా సృష్టించబడే tokenized వివరాలు మాత్రమే దీని ద్వారా ఉపయోగించవచ్చు. తద్వారా కార్డులు సురక్షితంగా ఉంటాయి. NFC ఆధారంగా పనిచేసే Samsung phone వాడుతున్న వారికి Samsung Payలో సరిగ్గా ఇదే సదుపాయం చాలా కాలం నుండి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా నేను 2018 నుండి Samsung Pay ద్వారా NFC చెల్లింపులు చేస్తున్నాను.

Google Pay తాజాగా ఈ సదుపాయాన్ని తీసుకు రావడం వలన మీ దగ్గర ఉన్న ఫోన్ మోడల్ తో సంబంధం లేకుండా, మీ ఫోన్ లో NFC సదుపాయం ఉంటే చాలు, మీ దగ్గర ఉన్న డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను గూగుల్ పే లో NFCకి జత చేసుకుని సులభంగా చెల్లింపులు జరపొచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా పెట్రోల్ బంక్ లేదా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ బిల్లింగ్ సమయంలో మీకు స్వైపింగ్ మిషన్ ఇచ్చినప్పుడు NFC ఆధారంగా పనిచేసే మీ ఫోన్ కేవలం ఆ స్వైపింగ్ మిషన్ కి ఒక్కసారి టచ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా చెల్లింపు జరిగిపోతుంది.

HDFC, Axis, కొటక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకులకు చెందిన వీసా కార్డులకు రాబోయే కొద్ది వారాల్లో గూగుల్ Pay ఈ సదుపాయం తీసుకొస్తుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర బ్యాంకులకు చెందిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు ఈ NFC చెల్లింపుల విధానంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.

Filed Under: Tech News Tagged With: debit credit card, google pay, Google Pay NFC based payments debit credit cards, NFC payments, UPI payments

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in