• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

whatsapp new features

Whatsappలో కొత్తగా రాబోతున్న రెండు సదుపాయాలివి!

by

Whatsappలో సుదీర్ఘకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న రెండు కొత్త సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. రెండూ కూడా అతి కీలకమైనవే.

Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhoneలకి మారే వారికి తరచూ ఏర్పడే అతి పెద్ద సమస్య iOSలో అప్పటి వరకూ ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ Androidలో రాకపోవడం, Androidలో ఉన్న ఛాట్ బ్యాకప్ iOSలోకి బదిలీ అవకపోవడం! దీని కోసం చాలామంది అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్స్ ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో Whatsapp అలాంటి ఇతర అప్లికేషన్స్ తమ నియమాలను ఉల్లంఘించాయని, అలాంటివాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ తనకు తానే స్వయంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది.

దీనిద్వారా ఇకమీదట మీరు Android phone నుండి iPhoneకి మారుతున్నా, iPhone నుండి Androidకి మారుతున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా అప్పటివరకు ఉన్న ఛాట్ బ్యాకప్ మొత్తాన్నీ కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

దీంతోపాటు కొంతమంది అధిక సమయం డెస్క్టాప్ కంప్యూటర్ మీద గడుపుతూ ఉండటం వల్ల Whatsapp Web ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వారు Whatsapp Webలో యాక్టివ్‌గా ఉండాలంటే వాట్సప్ ఇన్స్టాల్ చేయబడి ఉన్న మొబైల్ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. ఇక మీదట దీంతో సంబంధం లేకుండా, ఒకసారి ఒక నెంబర్ మీద వాట్స్అప్ వెబ్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఒకవేళ సంబంధిత ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్‌ నెట్‌కి కనెక్ట్ అయి లేకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాట్స్అప్ వెబ్ పనిచేసే విధంగా Whatsapp కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తోంది.

Whatsapp Beta వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అతి త్వరలో ఈ రెండు కొత్త సదుపాయాలు మొదట అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు ఇవి లభించటం జరుగుతుంది.

Filed Under: Tech News Tagged With: whatsapp Android iOS, whatsapp multiple devices support, whatsapp new features, Whatsapp web new features

Whatsapp వాడుతున్న వారికి శుభవార్త!

by

Whatsapp Web video audio calls new feature

Whatsapp వినియోగదారులకు శుభవార్త. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న ఒక కీలక సదుపాయం అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

ఆఫీస్ పని వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ అధిక సమయం కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ మీద గడిపే వినియోగదారులు చీటికిమాటికి ఫోన్ చేతిలో తీసుకోవాల్సిన పని లేకుండా Whatsapp Web సదుపాయం వాడతారు అన్న విషయం తెలిసిందే. దీనికోసం Google Chrome, Firefox వంటి బ్రౌజర్లలో web.whatsapp.com సైట్‌‌ని ఓపెన్ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పటివరకు కేవలం టెక్స్ట్ మెసేజ్ లు కంపోజ్ చేసుకోవటం, ఫోటోలు వీడియోలు వంటివాటిని షేర్ చేసుకోవడం మాత్రమే వాట్స్అప్ వెబ్ ద్వారా సాధ్యపడుతోంది.

మిత్రులు లేదా బంధువులకు వీడియో కాల్ చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక మీదట వాట్స్అప్ వీడియో కాల్స్ కూడా Whatsapp Web ద్వారా చేసుకునే అవకాశాన్ని ఆ సంస్థ అతి త్వరలో తీసుకు రాబోతోంది. కేవలం వీడియో కాల్స్ మాత్రమే కాకుండా ఇక మీదట వాట్స్అప్ వెబ్ ద్వారా ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు.

Whatsapp Beta వెర్షన్ వాడుతున్న కొంతమంది వినియోగదారులకు ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురాబడింది. మరింత ఎక్కువ మందికి త్వరలో ఇది అందుబాటులోకి వస్తుంది. అయితే మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా వాట్సాప్ వీడియో ఆడియో కాల్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా అందులో వెబ్ కెమెరా, మైక్రోఫోన్ ఉండాల్సి ఉంటుంది.

Whatsapp Web ద్వారా ఏదైనా కాల్ లో ఉన్నప్పుడు, ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ అయి అందులో కెమెరాను ఆన్ ఆఫ్ చేయడం, మైక్రోఫోన్ మ్యూట్ చేయడం, కాల్ తిరస్కరించడం వంటి ఆప్షన్స్ లభిస్తాయి. తమ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా Whatsapp వాడే వినియోగదారులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

Filed Under: Tech News Tagged With: whatsapp audio calls, whatsapp new features, whatsapp video calls, whatsapp web, Whatsapp Web video audio calls new feature

Whatsapp Beta లేటెస్ట్ వెర్షన్ iPhoneలకి వచ్చింది.. కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే!

by

Whatsapp beta iPhone new features

Whatsapp ఒకపక్క ఆండ్రాయిడ్ మరియు మరోపక్క iOS ఆపరేటింగ్ సిస్టం కోసం అప్పుడప్పుడు అనేక కొత్త సదుపాయాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫైనల్ వెర్షన్ కోసం వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే ముందు Beta వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు మొట్టమొదట అవి అందించబడతాయి. ఈ నేపథ్యంలో తాజాగా iOS ఆధారంగా పనిచేసే డివైస్ లు వాడుతూ Whatapp Beta ఉపయోగిస్తున్న వారికి కొత్తగా beta వెర్షన్ అందించబడింది.

2.20.120.17 అనే ఈ వెర్షన్‌లో అంతర్గతంగా ప్రధానంగా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. Whatsapp సంస్థ Whatsapp Web/Desktopలను ఉపయోగించడం కోసం ఇప్పటివరకు అందిస్తున్న ఇంటర్ఫేస్ కాకుండా, సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్ ప్రవేశపెట్టింది. అందులో Link a Device అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా, కంప్యూటర్ లో గాని లేదా ల్యాప్టాప్లో గానీ Whatsapp web కోడ్‌ని స్కాన్ చేసి అక్కడ కూడా వాట్స్అప్ వాడుకోవచ్చు. గతంలో ఉన్న సదుపాయమే అయినప్పటికీ, కొత్తగా యూజర్ ఇంటర్ఫేస్ మార్చబడింది.

ఇక రెండవదాని విషయానికి వస్తే, కొంతకాలం క్రితం, వాట్సప్ లో స్టోరేజ్ యూసేజ్ అనే ఫీచర్ ప్రవేశపెట్టబడింది. సరిగ్గా దానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో సరిగ్గా ఇదే ఫీచర్ అందిస్తున్న అన్ని రకాల సదుపాయాలు అందిస్తూ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అందుబాటులోకి వచ్చింది. బేటా వెర్షన్ వాడుతున్న వారు మీ ఐఫోన్ లో Whatsapp ఓపెన్ చేసి, Settingsలో Storage Usage అనే విభాగంలో కి వెళ్తే ఈ కొత్త మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా మీ ఫోన్లో భారీ స్థాయిలో స్టోరేజ్ స్థలాన్ని ఆక్రమించిన అన్ని ఫైల్స్ వివరాలు ఇక్కడ చూపించబడతాయి. దీని ద్వారా అనవసరమైన ఫైల్స్, ఫోటోలు మరియు వీడియోలు తొలగించుకొని మీ ఫోన్ లో స్పేస్ ఆదా చేసుకోవచ్చు.

Filed Under: Tech News Tagged With: Whatsapp beta iPhone new features, whatsapp iphone, whatsapp new features, whatsapp storage usage

Whatsappలో కొత్తగా వచ్చిన మరో సదుపాయం ఇది!

by

Whatsapp దశలవారీగా అనేక కీలకమైన ఆప్షన్లను ఒకదాని తర్వాత మరొకటి తన అప్లికేషన్లో పొందుపరుస్తూ వస్తోంది. అధికశాతం సందర్భాలలో Whatsapp Beta వెర్షన్ వాడే వినియోగదారులకు మాత్రమే ఈ సరికొత్త ఆప్షన్స్ మొట్టమొదట అందుబాటులోకి వస్తాయి. కొన్ని వారాల తరువాత మాత్రమే ఫైనల్ వెర్షన్ వాడేవారికి ఇవి లభిస్తాయి. అదేవిధంగా వాట్సాప్ లో తాజాగా మరో కొత్త ఆప్షన్ బీటా యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.

Whatsapp Beta 2.20.202.8 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు ఇక మీదట అప్లికేషన్ పరంగా ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ విషయాన్ని నేరుగా Whatsapp దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కొత్త వెర్షన్ లో వచ్చింది. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది కేవలం వాట్సప్ అప్లికేషన్ క్రాష్ అవటం గానీ, ఇతర సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే తప్పించి Whatsapp పరంగా వచ్చే మామూలు సందేహాలు, లేదా సమస్యల గురించి చెప్పడానికి కాదు.

Whatsapp అప్లికేషన్ లోనే అంతర్గతంగా Contact Us అనే విభాగంలోకి వెళితే Tell us more అనే ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ మీ సమస్య గురించి సమాచారాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత సమస్య ఎందుకు ఏర్పడిందో వాట్స్అప్ సాంకేతిక బృందం విశ్లేషించడం కోసం ఆ క్రిందనే Include device information అనే ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేయడం ద్వారా మీ ఫోన్ మోడల్, అందులో ఉన్న ఇతర సెట్టింగ్స్ వివరాలు Whatsapp సాంకేతిక బృందం దృష్టికి తీసుకు వెళ్ళబడతాయి. వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ సమస్యకు గల కారణాలు వారు అర్థం చేసుకొని దానికి పరిష్కారాన్ని మీకు సూచించే అవకాశం ఉంది.

Whatsapp అప్లికేషన్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెబ్సైట్ కి వెళ్లాల్సిన పని లేకుండా, నేరుగా ఎర్రర్ లాగ్స్‌తో వాట్సప్ సపోర్ట్‌ని సంప్రదించే అవకాశం కలగడం ఇదే మొట్టమొదటిసారి!

Filed Under: Tech News Tagged With: whatsapp contact, whatsapp features, whatsapp new features, Whatsapp technical support new feature, whatsapp tips

Whatsapp కొత్త వెర్షన్‌లో వచ్చిన మరో ఫీచర్ ఇది!

by

whatsapp web catalog feature

Whatsappలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు ప్రవేశపెట్టబడుతూ ఉంటాయి. సహజంగా వాట్సప్ మొట్టమొదట Beta వెర్షన్ వాడుతున్న వారికి కొత్త సదుపాయాలు అందించి కొన్ని రోజుల టెస్టింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాక్టికల్ సమస్యలు లేవని భావించినప్పుడు మాత్రమే ఫైనల్ వెర్షన్ ద్వారా వినియోగదారులకు ఆ సదుపాయాన్ని అందిస్తుంది.

ఇదే క్రమంలో తాజాగా Whtsapp Web 2.2039.9 వెర్షన్ వాడుతున్న యూజర్లకు ఒక కొత్త సదుపాయం కనిపిస్తోంది. Whatsapp Business అకౌంట్ కలిగి ఉన్న ఏదైనా వాట్సప్ ఛాట్‌లోకి వెళ్ళినప్పుడు, గతంలో లేనివిధంగా Catalog అనే షార్ట్ కట్ వచ్చేసింది. వాస్తవానికి Whatsapp Business అకౌంట్ కలిగి ఉన్న వినియోగదారులకు కొన్ని రోజుల క్రితం తమ వ్యాపారానికి సంబంధించిన కేటలాగ్ గూడా తమ అకౌంట్లో జత చేసే విధంగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీని ద్వారా వివిధ రకాల సంస్థలు తమ దగ్గర ఉన్న ఉత్పత్తుల గురించి పూర్తిస్థాయిలో కేటలాగ్ తయారుచేసి.. అవి ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అందించవచ్చు.

ఉదాహరణకు ఒక రెస్టారెంట్ ఉంటే, అది తమ దగ్గర దొరికే ఆహార పదార్థాల గురించి పూర్తిస్థాయి మెనూ, కేటలాగ్ రూపంలో తయారుచేసి తమ Whatsapp Business అకౌంట్లో పొందుపరిచి వినియోగదారులకు అందుబాటులో ఉంచొచ్చు. దీనికి సంబంధించిన షార్ట్కట్ తాజాగా Whatsapp Web వాడుతున్న యూజర్లకు దర్శనమిచ్చింది.

మీరు Whatsapp Web 2.2039.9 వెర్షన్ వాడుతున్నట్లయితే, ఏదైనా Business Whatsapp సంస్థ మీకు గతంలో చేసిన ఛాట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూడండి. అందులో ప్రత్యేకంగా కేటలాగ్ అనే కొత్త బటన్ స్క్రీన్ పై భాగంలో కనిపిస్తుంది. ఒకవేళ సంబంధిత వ్యాపార సంస్థ కనుక ఏదైనా కేటలాగ్ అందిస్తూ ఉన్నట్లయితే ఆ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా ఆ కేటలాగ్ మొత్తాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు.

Filed Under: Tech News Tagged With: whatsapp features, whatsapp new features, whatsapp web, whatsapp web catalog feature

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsappలో కొత్తగా రాబోతున్న రెండు సదుపాయాలివి!
  • Redmi Note 10 సేల్ ఈరోజు.. మరిన్ని వివరాలు ఇక్కడ!
  • మీ phoneలో Mobile Data సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించండి!
  • Whatsapp Backup ఇక మరింత పదిలం.. కొత్త ఫీచర్ తీసుకు వస్తున్న Whatsapp
  • టెంపరరీగా Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in