• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

whatsapp payments

Whatapp Payments విషయంలో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త!

by

Whatsapp Payemnts frauds precautions

ఇటీవల అందుబాటులోకి వచ్చిన Whatsapp Payments సదుపాయాన్ని చాలా మంది ఇప్పటికే వినియోగించుకుంటున్నారు. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని అనేకమంది సైబర్ నేరస్తులు ఫ్రాడ్‌లకు పాల్పడుతున్నారు. మీరు చేసే ఒక చిన్న తప్పు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి కారణమౌతుంది. అందుకే ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.

Whatsapp Paymentsకీ, Whatappకీ ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ వుండదు. మీకు ఏదైనా లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు వేచి ఉంటే అది విజయవంతంగా పూర్తి అవ్వటం గానీ, లేదా మీ అకౌంట్ లోకి వెనక్కి డబ్బులు రావడం గానీ జరుగుతుంది. అంతే తప్పించి Google, Youtubeలలో Whatsapp Customer Care నెంబర్ అని వెదికితే అనేక నకిలీ ఫలితాలు కనిపిస్తాయి. అలాంటి నంబర్లకు కాల్ చేస్తే, ఈ అకౌంట్ కి డబ్బులు ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు.

Whatapp సంస్థ ఏ కస్టమర్ కి నేరుగా ఫోన్ చేయదు. ఒకవేళ ఎవరైనా మీకు వాట్సాప్ ప్రతినిధులుగా ఫోన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో బాబు అడిగిన ఎలాంటి వివరాలు చెప్పకండి. ముఖ్యంగా వాట్సప్ పేమెంట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలా వచ్చిన ఫోన్ కాల్స్ కి చాలామంది వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి కాల్స్ వెంటనే కట్ చేయండి.

మంచి బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన పనితీరు కలిగి, విపరీతంగా అమ్ముడుపోతున్న Samsung Galaxy M51 (Celestial Black, 6GB RAM, 128GB Storage) అసలు ధర 24,999 కాగా కేవలం 22,999కే పొందండి. SBI క్రెడిట్ కార్డ్ వాడే వారు మరో 2,500 తగ్గింపుతో కేవలం 20,499కే పొందొచ్చు. బెస్ట్ డీల్.. https://amzn.to/3ns2JRR

కొన్ని సందర్భాలలో మీ ఫోన్నెంబర్ తెలుసుకున్న సైబర్ నేరస్తులు Whatapp Payment Request పంపిస్తారు. తెలిసీ తెలీక ఒకవేళ మీరు దానిని ట్యాప్ చేసినట్లయితే వెంటనే సంబంధిత మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ అయిపోతుంది. కాబట్టి మీకు వచ్చిన మెసేజ్ పేమెంట్ రిక్వెస్టా, లేక పేమెంట్‌నా అన్న విషయం గమనించి దానికి తగ్గట్లుగా వ్యవహరించండి. ఇవి మాత్రమే కాదు, మీ Whataspp Payments UPI PINని గానీ, మీ Whatapp అకౌంట్‌‌కి సంబంధించిన ఓటిపిలను గానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో చేసుకోకండి. ఈ జాగ్రత్తలన్నీ అనుసరిస్తే కచ్చితంగా మీ Whatapp Payments అకౌంట్ సురక్షితంగా ఉంటుంది.

Filed Under: How-To Guide Tagged With: cyber crimes, internet banking, UPI payments, whatsapp, Whatsapp Payemnts frauds precautions, whatsapp payments

PhonePe, Google Pay ఇక సర్ధుకోవలసిందేనా? Whatsapp Payments వచ్చింది!

by

Whatsapp Payments Google Pay Phone Pe

భారతీయ మార్కెట్లో UPI అప్లికేషన్స్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిన్నమొన్నటి వరకు మార్కెట్ లీడర్ గా ఉన్న Google Payని వెనక్కి నెట్టి PhonePe ఇటీవల త్రైమాసికంలో మొదటి స్థానం లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఎదురు కాబోతోంది.

తమ smartphoneలో Whatsapp లేని వినియోగదారుడు ఉండడు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో 2018లో పది లక్షల మంది వినియోగదారులకు ట్రయల్ బేసిస్ మీద అందుబాటులోకి వచ్చిన Whatsapp Paymentsకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం నుండి అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన పేమెంట్ డేటా ఇండియాలోనే భద్రపరచాలి అనే నియమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టిగా పెట్టింది. దీనికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడం విషయంలో ఇప్పటివరకు Whatsapp Payments ఆలస్యమైంది.

అయితే ఎట్టకేలకు UPI చెల్లింపులకు సంబంధించి అధికారిక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) Whatsappకి పూర్తి స్థాయిలో అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా నిన్న చేసింది. ఈ నేపథ్యంలో దశలవారీగా Whatsapp Payments మనకు అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం చాలామంది యూజర్లకి Whatapp Payments అందుబాటులోకి రావడంతో వాట్సాప్ ద్వారా ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే అంత సులభంగా మనం ఎవరికైనా డబ్బులు కూడా పంపించు కునే అవకాశం లభించింది. వాట్సాప్ పేమెంట్ సదుపాయాన్ని వాట్సప్ అప్లికేషన్ లో పూర్తిస్థాయిలో ఇంటిగ్రేట్ చేయటం చాలా సులభమైన విషయం. ఇప్పటికే ఆ ఇంటిగ్రేషన్ పూర్తయి పూర్తి స్థాయిలో ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.

ఈ నేపధ్యంలో GooglePe, PhonePeలకు ప్రత్యామ్నాయంగా Whatsapp Paymentsని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ కీలకమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. NPCI నిబంధనల ప్రకారం భారతదేశం లో పనిచేస్తున్న ఏ UPI అప్లికేషన్ కూడా 33 శాతం వాటాకి మించి కలిగి ఉండకూడదు. ఈ నేపథ్యంలో Whatsapp Payments ఎంత పాపులర్ అయిన ప్పటికీ, అది మొత్తం మార్కెట్ షేర్ సొంతం చేసుకునే అవకాశాలు మాత్రం లేవు.

Filed Under: Tech News Tagged With: google pay, PhonePe, whatsapp new feature, whatsapp payments, Whatsapp Payments Google Pay Phone Pe

మీ Whatsapp డేటాని Reliance Jioకి Facebook ఇవ్వబోతోందా?

by

Whatsapp Reliance Jio integration

కొంతకాలం క్రితం Reliance Jioలో Facebook పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం 5.7 బిలియన్ డాలర్ల మేరకు ఆ సంస్థ Reliance Jioలో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా దానిని Whatsappని ఆధారంగా చేసుకుని శక్తివంతమైన రిటైల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం వినియోగించబోతున్నట్లు సమాచారం.

ఆ క్రమంలోనే Jio Mart అప్లికేషన్ మీద Reliance Jio ఈమధ్య బాగా దృష్టి పెట్టింది. Jio Mart, Whatsappలకు మధ్య కొంత మేరకు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా మరింత వ్యాపారాభివృద్ధి జరిగే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన కొంత Whatsapp డేటాని Facebook సంస్థ Reliance Jioకి అందించబోతోందని ఓ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. వినియోగదారులకు సంబంధించిన వ్యాపార పరమైన డేటాను ఈ రెండు సంస్థలు ఇచ్చిపుచ్చుకుంటాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ రిపోర్ట్ ప్రకారం Whatsapp, Facebook సంస్థల మధ్య ఎలా డేటా ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉందో అదే విధమైన భాగస్వామ్యం Jio Martకీ, Whatsappకి మధ్య ఉండే అవకాశం ఉంది. చైనాలో We Chat మాదిరిగా Whatsappని తీర్చిదిద్దే యోచనలో రెండు సంస్థలు ఉన్నట్లు సమాచారం. We Chat ద్వారా కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా తమకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేసి తెప్పించుకోవడం, వివిధ రకాల సర్వీసులకు బిల్లులు చెల్లించడం వంటి పలు పనులను చైనా ప్రజలు చేస్తూ ఉంటారు. అదే మాదిరి సదుపాయాన్ని Whatsappలో ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

JioMart ఇంటిగ్రేషన్ మాత్రమే కాకుండా Whatsapp Payments సదుపాయం కూడా పైన చెప్పిన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఏ రూపంలో, ఎంత మేరకు JioMartకి, Whatsappకి మధ్య ఇంటిగ్రేషన్ జరుగుతుంది అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.. JioMart ఇప్పటికే ఉన్న Big Basket, ఇతర డెలివరీ అప్లికేషన్లకు భిన్నంగా మరింత శక్తివంతంగా రాబోతోంది. అలాగే Whatsappని కేవలం ఛాటింగ్ కోసం మాత్రమే కాకుండా అన్ని పనులకు వాడుకునే రోజులు రాబోతున్నాయి.

Filed Under: Tech News Tagged With: jiomart, reliance jio, whatsapp, whatsapp payments, Whatsapp Reliance Jio integration

Whatsapp మీద కఠిన చర్యలు తీసుకోబోతున్న ప్రభుత్వం!

by

whatsapp payments govt of india

Whatsapp Payments విషయంలో మొదటి నుండి అనేక రకాల అవరోధాలు ఎదుర్కొంటున్న వాట్సప్ సంస్థకి  మళ్లీ గడ్డు రోజులు వచ్చాయి.

అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Whatsapp మీద  కఠిన చర్యలకు పూనుకున్నాయి. UPI ఆధారంగా వినియోగదారులు ఒకరి నుంచి మరొకరు సులభంగా డబ్బులు పంపించుకోగలిగే విధంగా Whatsapp Payments సర్వీస్‌ని  గత ఏడాది వాట్సప్ తీసుకు వచ్చిన విషయం చాలామందికి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ సర్వీసుకు సంబంధించిన ఎలాంటి నిర్దిష్టమైన పూర్తిస్థాయి అనుమతి వాట్సాప్ సంస్థకు లభించలేదు.

కనీసం వాట్సాప్ సంస్థకు Whatsapp Payments సర్వీస్‌ ఇండియాలో టెస్ట్ చేయటానికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేదు.  అయితే వాట్సప్ వాటన్నిటినీ బేఖాతరు చేసి, ఇండియాలో ఆ సర్వీస్‌ని పెద్ద మొత్తంలో వినియోగదారులకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో  వాట్సాప్ పేమెంట్స్ మీద సుప్రీం కోర్టు లో నడుస్తున్న ఒక కేసు‌కి సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మీద చర్యలు తీసుకోబోతున్నట్లు  వెల్లడించింది.

గతంలో కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా వాట్సప్ ప్రతినిధులతో  సమావేశమైనప్పుడు వినియోగదారులకు చెల్లింపులు జరిపే సమయంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు పరిష్కరించడం కోసం ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించవలసిందిగా  కోరినప్పటికీ వాట్సప్ సంస్థ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. అంతేకాదు పేమెంట్ డేటా మొత్తం కేవలం ఇండియా లో మాత్రమే భద్రపరచబడే విధంగా స్థానికంగా సర్వర్లు  నెలకొల్పాలని కోరినప్పటికీ దానికి కూడా వాట్సాప్ సుముఖత వ్యక్తం చేయలేదు. వీటన్నిటినీ కారణాలుగా చూపించి వాట్సాప్ మీద పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి కేంద్రం సన్నాహాలు జరుపుతోంది.

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007ని ఉల్లంఘించినందుకు గాను ఇండియాలో నిర్వహించబడుతున్న పలు వాలెట్ సర్వీస్ ల మీద పెద్ద మొత్తంలో పెనాల్టీని విధించడం జరిగింది.  ఇందులో భాగంగా వోడాఫోన్ M-pesa మీద 3.05 కోట్లు, మొబైల్ పేమెంట్స్ మీద కోటి రూపాయలు, PhonePe మీద కోటి రూపాయలు జరిమానా విధించబడింది.

Filed Under: Tech News Tagged With: whatsapp payments

Whatsapp Payments ఇప్పుడు మీకు కూడా వచ్చేసింది!

by

సుదీర్ఘకాలంగా దేశవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులు వేచి చూస్తున్న Whatsapp Payments  సదుపాయం ఎట్టకేలకు అందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

వాస్తవానికి ఫిబ్రవరి 2018 నుండి ఈ ఫీచర్  ప్రయోగాత్మకంగా దేశంలోని 10 లక్షల మంది వినియోగదారులు లభిస్తూ ఉంది.  అయితే దీన్ని పూర్తిస్థాయిలో విస్తరించాలన్న Whatsapp ప్రయత్నానికి అనేక అడ్డంకులు వస్తూ  ఇంతకాలం వాయిదాపడుతూ వచ్చింది. వినియోగదారుల పేమెంట్ డేటా విదేశీ సర్వర్లలో భద్రపరచబడుతోంది అంటూ Paytm వంటి  సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ ఫీచర్‌కి చాలాకాలంనుండి బ్రేక్ పడింది.

అలాగే ఇటీవల కాలంలో వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న పుకార్లని నమ్మి  దేశవ్యాప్తంగా అనేక మూకదాడులు జరగడం వాట్సప్‌కి పెద్ద తలనొప్పిగా మారడంతోపాటు Whatsapp Payments  సదుపాయం మరింత ఆలస్యం కావడానికి కారణమైంది. మొత్తానికి ఎలాంటి అవాంతరాలు అన్నీ దాటుకుని ఇంతకాలానికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతానికి Android, iOS  ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో Whatsapp Beta వెర్షన్ వాడుతున్న  అందరు వినియోగదారులకు లేటెస్ట్ అప్డేట్ ద్వారా ఈ ఆప్షన్ వచ్చేసింది. మీరు Whatsapp Beta వెర్షన్  వాడుతున్నట్లయితే Whatsapp>Settings>Payments అనే విభాగం ద్వారా దీన్ని కాన్ఫిగర్ చేయవచ్చు. ఒకవేళ మీరు వాట్సాప్ ఫైనల్ వెర్షన్  వాడుతున్నట్లయితే మరికొద్ది రోజుల్లో ఈ ఆప్షన్ మీకు అందుబాటులోకి రాబోతోంది. ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో “ కంప్యూటర్ ఎరా” గతంలో తయారు చేసిన వీడియో డెమోని  ఈ కింద చూడవచ్చు.

Filed Under: Tech News Tagged With: whatsapp payments

  • Go to page 1
  • Go to page 2
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in