• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

whatsapp tips

మీ Whatsapp అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయండి!

by

how to get back hacked whatsapp account

Whatsapp అకౌంట్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా హ్యాక్ అవుతున్నాయి. మీ మొబైల్ నెంబర్ తెలుసుకున్న హ్యాకర్లు, మీ నెంబర్‌తో వాట్సప్‌ని రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నించి, అప్పుడు జనరేట్ అయ్యే 6 డిజిట్స్ కోడ్‌ని మీ ద్వారానే తెలుసుకొని మీ అకౌంట్ కాంప్రమైజ్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈనేపథ్యంలో మీ అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలంటే మొట్టమొదట చేయాల్సిన పని.. ఎవరైనా మీ ఫోన్ కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ చెప్పమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. అంతేకాదు, వెరిఫికేషన్ కోడ్ SMSలో ఉండే లింక్‌ని క్లిక్ చేయకండి. ఒకవేళ పొరపాటున మీరు మీ Whatsapp అకౌంట్‌ని పోగొట్టుకున్నట్లు అయితే దీనికి రెండు మార్గాలున్నాయి.

మీ అకౌంట్ కి, మీరు గానీ, మీ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి గానీ 2-స్టెఫ్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయకపోతే, మీ ఫోన్లో మీ అకౌంట్‌ని తిరిగి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా, అవతలి వ్యక్తి ఫోన్ లో మీ అకౌంట్ ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అధికశాతం మంది హ్యాకర్లు మీ అకౌంట్‌ని వారు చేజిక్కించుకున్న వెంటనే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రస్తుతానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు.

మీరు వారం రోజుల పాటు ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మీ ఫోన్లో వాట్స్అప్ ఇన్స్టాల్ చేసుకొని, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ అకౌంట్లోకి రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మర్చిపోకుండా మీ వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి.

Whatsapp ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉండటం వల్ల, ఒకవేళ హ్యాకర్ మీ అకౌంట్ హ్యాక్ చేసిన కూడా, మీ స్నేహితులతో మీరు చేసిన సంభాషణలో తెలుసుకునే అవకాశం ఉండదు. అయితే మీ స్నేహితులను డబ్బులు కావాలంటూ మీ తరఫున అభ్యర్థించే ప్రమాదముంటుంది. కాబట్టి ఈ విషయంలో మీ స్నేహితులను అప్రమత్తం చేయండి.

Filed Under: How-To Guide Tagged With: how to get back hacked whatsapp account, whatsapp, whatsapp security, whatsapp tips

Whatsappలో కొత్తగా వచ్చిన మరో సదుపాయం ఇది!

by

Whatsapp దశలవారీగా అనేక కీలకమైన ఆప్షన్లను ఒకదాని తర్వాత మరొకటి తన అప్లికేషన్లో పొందుపరుస్తూ వస్తోంది. అధికశాతం సందర్భాలలో Whatsapp Beta వెర్షన్ వాడే వినియోగదారులకు మాత్రమే ఈ సరికొత్త ఆప్షన్స్ మొట్టమొదట అందుబాటులోకి వస్తాయి. కొన్ని వారాల తరువాత మాత్రమే ఫైనల్ వెర్షన్ వాడేవారికి ఇవి లభిస్తాయి. అదేవిధంగా వాట్సాప్ లో తాజాగా మరో కొత్త ఆప్షన్ బీటా యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.

Whatsapp Beta 2.20.202.8 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు ఇక మీదట అప్లికేషన్ పరంగా ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ విషయాన్ని నేరుగా Whatsapp దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కొత్త వెర్షన్ లో వచ్చింది. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది కేవలం వాట్సప్ అప్లికేషన్ క్రాష్ అవటం గానీ, ఇతర సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే తప్పించి Whatsapp పరంగా వచ్చే మామూలు సందేహాలు, లేదా సమస్యల గురించి చెప్పడానికి కాదు.

Whatsapp అప్లికేషన్ లోనే అంతర్గతంగా Contact Us అనే విభాగంలోకి వెళితే Tell us more అనే ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ మీ సమస్య గురించి సమాచారాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత సమస్య ఎందుకు ఏర్పడిందో వాట్స్అప్ సాంకేతిక బృందం విశ్లేషించడం కోసం ఆ క్రిందనే Include device information అనే ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేయడం ద్వారా మీ ఫోన్ మోడల్, అందులో ఉన్న ఇతర సెట్టింగ్స్ వివరాలు Whatsapp సాంకేతిక బృందం దృష్టికి తీసుకు వెళ్ళబడతాయి. వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ సమస్యకు గల కారణాలు వారు అర్థం చేసుకొని దానికి పరిష్కారాన్ని మీకు సూచించే అవకాశం ఉంది.

Whatsapp అప్లికేషన్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెబ్సైట్ కి వెళ్లాల్సిన పని లేకుండా, నేరుగా ఎర్రర్ లాగ్స్‌తో వాట్సప్ సపోర్ట్‌ని సంప్రదించే అవకాశం కలగడం ఇదే మొట్టమొదటిసారి!

Filed Under: Tech News Tagged With: whatsapp contact, whatsapp features, whatsapp new features, Whatsapp technical support new feature, whatsapp tips

అవతలి వారు డిలీట్ చేయబడిన Whatsapp మెసేజ్‌లు ఇలా చదవండి!

by

How to read deleted whatsapp messages

ఈ మధ్య కాలంలో చాలా మంది Whatsappలో మనకు ఓ మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత మనసు మార్చుకుని గానీ, లేదా మనల్ని ఆటపట్టించడానికి గానీ పంపించిన మెసేజ్‌ని మళ్లీ Delete for Everyone అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కనిపించకుండా డిలీట్ చేస్తారు. ఇలా అవతలివారు డిలీట్ చేసిన మెసేజ్లను చదవడం కోసం అనేక రకాల టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అన్నిటి కంటే సులభమైన టెక్నిక్ ఇక్కడ చూద్దాం.

దీనికోసం మీరు చేయాల్సింది ఈ లింక్ నుండి WhatsTool అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం! దాన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేకరకాల పనులు చేస్తుంది. ఆ టూల్ హోమ్ స్క్రీన్‌లో recover deleted messages అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

అయితే ఈ అప్లికేషన్ పనిచేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ లో వాట్సాప్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయబడి ఉండాలి. చాలామంది ఫోన్లో ఇవి ఆటోమేటిక్గా ఎనేబుల్ చేయబడి ఉంటాయి కాబట్టి వర్రీ అవ్వాల్సిన పనిలేదు. అయితే ఒకవేళ మీకు మీరు వాట్సాప్ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేస్తే మాత్రం, ఈ టూల్ సక్రమంగా పని చేయడం కోసం నోటిఫికేషన్స్ మళ్లీ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత WhatsTool అనే ఈ అప్లికేషన్ ఈ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ చదవగలిగే విధంగా పర్మిషన్ ఎనేబుల్ చేయాలి.

ఇక merit 5 బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ పరిశీలిస్తూ, వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి, ఒకవేళ అవతలి వ్యక్తి తాను పంపించిన మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ, ఈ అప్లికేషన్ వాటిని మళ్లీ మనకు చూపిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా పొడవాటి వీడియోలను పల్లి ముక్కలుగా చేసుకోవడం, వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయడం వంటి అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

Filed Under: How-To Guide Tagged With: android application, google play store, How to read deleted whatsapp messages, whatsapp message recovery, whatsapp tips

Whatsappలో ఏదైనా ముఖ్యమైన ఛాట్‌ని ఇతరులకు కనిపించకుండా దాచిపెట్టడం ఇలా!

by

How to hide a chat in Whatsapp

Whatsapp వాడే వినియోగదారులకు తమ వాట్సాప్ ఎకౌంట్ ఓపెన్ కాకుండా ఫింగర్ ప్రింట్ ద్వారా లక్షణ కల్పించుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, అత్యంత సన్నిహితమైన వ్యక్తి‌తో మీరు చేసే ఛాట్ ఒక్కటే ఇతరులకు కనిపించకుండా ఏర్పాటు చేయాలనుకుంటే ఒక అద్భుతమైన టెక్నిక్ అందుబాటులో ఉంది.

దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. చాలా కాలం నుండి Whatsappలో అంతర్గతంగా ఉన్న సదుపాయం ఇది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ phoneలో Whatsapp అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో Chats అనే విభాగం లో ఉండండి. అక్కడ మీకు పలువురి వ్యక్తులతో మీరు చేసిన ఛాటింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా! అందులో మీరు ఎవరు ఛాటింగ్ అయితే ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఛాట్ కన్వర్‌జేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్క్రీన్ పై భాగంలో కనిపించే Archive అనే ఐకాన్ టాప్ చేస్తే సరిపోతుంది.

దీంతో ఆ వ్యక్తితో మీరు జరిపిన సంభాషణ Archive చేయబడి Chats అనే విభాగంలో ఎవరికీ పైకి కనిపించదు. తర్వాత ఎప్పుడైనా మళ్లీ దాన్ని మీరు చూడాలి అనుకుంటే Chats స్క్రీన్‌లో అడుగు భాగంలో ఉండే Archived Chats అనే విభాగంలోకి వెళ్లి, ఏ ఛాట్ అయితే తిరిగి వెనక్కు తీసుకురావాలి అనుకుంటున్నారో దాన్ని tap చేసి, hold చేసి, స్క్రీన్ పై భాగంలో కనిపించే Unarchive అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఇలా ఒకరిద్దరు ఛాట్ కాకుండా మీరు Whatsappలో సంభాషించిన అందరి వ్యక్తుల ఛాట్ కన్వర్‌జేషన్‌ని దాచి పెట్టాలనుకుంటే, Settings అనే విభాగంలోకి వెళ్లి, Chats> Chat History> Archive All అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో మనకు అవసరమైనప్పుడు అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకు రావచ్చు.

Filed Under: How-To Guide Tagged With: How to hide a chat in Whatsapp, whatsapp archive chat, whatsapp personal chat, whatsapp security, whatsapp tips

Whatsapp బ్యాకప్ గురించి చాలా మందికి తెలియని విషయాలు!

by

whatsapp backup interesting facts

Whatsapp వాడే ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే.. ప్రతీ రోజు ఒక సారి మీ వాట్సప్ అకౌంట్ మొత్తం బ్యాకప్ తీయబడుతుంది అని! అయితే ఈ బ్యాకప్ విషయంలో చాలా మందికి తెలియని అనేక సంగతులు ఉన్నాయి.

అవి సురక్షితం కాదు!

కేవలం Whatsapp అప్లికేషన్ లో మాత్రమే, దానికి సంబంధించి మీ ఫోన్లో భద్రపరచబడి ఉండే డేటాబేస్‌కి మాత్రమే ఎన్క్రిప్షన్ అమలుపరచ బడుతుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది Google Drive, Apple iCloud వంటి వాటిలో వాట్సప్ ఆటోమేటిక్గా బ్యాకప్ తీయబడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మీ వాట్సప్ అప్లికేషన్ దాటి బ్యాక్ అప్ కోసం డేటా బయటకు పోయింది అంటే ఇక దానికి ఏమాత్రము ఎన్క్రిప్షన్ వర్తించదు. అంటే, ఎవరైనా మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్, iCloud అకౌంట్లను కంట్రోల్ లోకి తీసుకోవడం ద్వారా గతంలో మీరు ఎవరితో ఏం ఛాట్ చేశారన్నది అక్కడ ఉండే డేటాబేస్ ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉంది.

వాట్సప్ పిన్ ముఖ్యం

తప్పనిసరిగా మీ వాట్స్అప్ ఎకౌంట్లో two-factor authentication ఎనేబుల్ చేసుకొని, దానికి బలమైన పిన్ సెట్ చేసుకోండి. అది మాత్రమే చాలా వరకు మీ వాట్సప్ అకౌంట్ ని కాపాడగలుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. వాట్సప్ పిన్ మర్చిపోకుండా, ఈమెయిల్ ఐడి ద్వారా దాన్ని తెలుసుకునే అవకాశం కూడా వాట్సాప్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఈ మెయిల్ ఐడి తప్పుగా టైప్ చేసినప్పుడు, భవిష్యత్తులో అవసరమైనప్పుడు అసలైన ఈమెయిల్ ఐడి తో పిన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ వాట్స్అప్ ఎకౌంట్ లాక్ అయిపోతుంది. అందుకే పిన్ రిట్రీవల్ కోసం ఉపయోగించే మెయిల్ ఐడి టైప్ చేసేటప్పుడు దానిని స్పష్టంగా టైప్ చేయండి.

ఎక్స్‌పోర్ట్ చేస్తే!

మీ ఫోన్ లో ఉంటే వాట్స్అప్ ఛాట్‌ని మెయిల్‌కి గానీ, ఇతర ప్రదేశాలకు గాని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, అది plaintext గా మాత్రమే పంపించబడుతుంది. End to end encryption తొలగించబడుతుంది. అలాగే ఒకవేళ మీ ఫోన్లో గనక ఛాట్ బ్యాకప్ తీయబడి ఉన్నట్లయితే, దానిని పెన్ డ్రైవ్ ద్వారా గాని, మెమరీ కార్డు ద్వారా గాని వెళ్లే ప్రదేశాలకు డేటాబేస్ ని కాపీ చేసుకోవచ్చు. అలాగే బ్యాకప్ వద్దు అనుకుంటే, మీ ఫోన్లో సంబంధిత చాట్ బ్యాకప్ ఫోల్డర్‌లోకి వెళ్లి దాన్ని తొలగించవచ్చు

Filed Under: How-To Guide Tagged With: google drive backup, how to recover whatspp deleted chat, whatsapp backup, whatsapp backup interesting facts, whatsapp tips

  • Go to page 1
  • Go to page 2
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!
  • మీ Android phoneలో డిలీట్ అయిన డేటా తిరిగి పొందటానికి మెథడ్స్

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in