• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

xiaomi phone

Redmi 9 Power రిలీజ్ అయింది.. Realme Narzo 20కి ఇది ఎంతవరకు పోటీ ఇస్తుంది?

by

Redmi 9 Power vs Realme Narzo 20

Xiaomi ఈ సంస్థ తాజాగా భారత మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ Redmi 9 Powerని విడుదల చేసింది. 10999 రూపాయల ధరకు Amazonలో 22వ తేదీ మధ్యాహ్నం మొట్టమొదటి సేల్ జరగబోతోంది. ఇప్పటికే 10,499 రూపాయలకు లభిస్తున్న Realme Narzo 20కి ఇది ఎంతవరకు పోటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

Redmi 9 Power స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తుంది. సరిగ్గా అదే సామర్థ్యం కలిగిన బ్యాటరీ Realme Narzo 20లో కూడా ఉంటుంది. స్క్రీన్ పరిమాణం విషయానికొస్తే Redmi 9 Powerలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంటే, మరోవైపు Realme Narzo 20లో 6.5 అంగుళాల కేవలం హెచ్ డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. అంటే పరోక్షంగా స్క్రీన్ రిజల్యూషన్ పరంగా చూస్తే Redmi 9 Power కచ్చితంగా అడ్వాంటేజ్ కలిగి ఉంది.

Redmi 9 Powerలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాస ఉపయోగించబడి ఉంటే, మరోవైపు Realme Narzo 20లో మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ లభిస్తుంది. కెమెరాల విషయానికొస్తే Redmi 9 Powerలో 48 megapixel ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ultrawide సెన్సార్, 2 మెగా పిక్సల్ డెప్త్, 2 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. Realme Narzo 20లో కేవలం వెనకభాగంలో మూడు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా 40 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్ కెమెరా యథాతథంగా ఉంటుంది.

బరువు విషయంలో కూడా Redmi 9 Power కేవలం 198 గ్రాముల బరువు ఉంటే, Realme Narzo 20 రెండు వందల ఎనిమిది గ్రాముల బరువు ఉంటుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది అసౌకర్యంగా ఉంటుంది. రెండు ఫోన్లు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివున్నాయి.

ఈ అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా ప్రాసెసర్, స్క్రీన్ రిజల్యూషన్, వెనక భాగంలో కెమెరాల విషయంలో Redmi 9 Power మరింత మెరుగ్గా ఉంది. అయితే ధర విషయంలో మాత్రం Realme phoneని ₹500 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Filed Under: Gadgets Tagged With: new smartphone, realme narzo 20, redmi 9 power, Redmi 9 Power vs Realme Narzo 20, xiaomi phone

Xiaomi phoneలో Airtel వాడుతున్నారా? మీ ఫోన్ క్రాష్‌కి కారణం ఇది!

by

xiaomi airtel phone reboot problem

Xiaomi, Mi phoneలు వాడుతున్న అనేకమంది Airtel వినియోగదారులు తాజాగా దేశవ్యాప్తంగా విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు.

ఉన్న ఫళంగా phone క్రాష్ అయిపోవడం, హోమ్స్క్రీన్ రాకుండా మళ్లీమళ్లీ బూట్ లూప్‌లో ఇరుక్కోవడం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో యూజర్లు తమ ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికైతే Airtel మాత్రమే కాకుండా ఇతర SIM కార్డులను ఉపయోగించినా కూడా సమస్య ఎదురవుతోంది. దీనికి సంబంధించి పరిష్కారాన్ని అప్డేట్ చేసే ప్రయత్నంలో Xiaomi ఇప్పటికే ఉంది. Airtel సంస్థ ఈ పరిష్కారాన్ని అందించడం కోసం Xiaomi సంస్థతో కలిసి పని చేస్తోంది.

చాలా మంది వినియోగదారులకు Find Device Closed Unexpectedly అనే మెసేజ్ స్క్రీన్ మీద చూపించబడి ఇబ్బంది ఏర్పడుతోంది. ఆ తర్వాత ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది. అప్లికేషన్ అప్డేట్ సమయంలో నిర్దిష్టమైన కోడ్ సక్రమంగా పని చేయకపోవడం వలన ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే వారానికి దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఇబ్బంది కరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ సమస్య ఎదుర్కొంటున్న వినియోగదారులు ఈ కొత్త అప్డేట్ తమకు తాము ఇన్స్టాల్ చేసుకునే అవకాశం లేదు.

Zebronics Zeb-Juke Bar 5 Multimedia Sound Bar with Bluetooth Connectivity,USB Input and Built-in FM అసలు ధర MRP:7,399 కాగా ప్రస్తుత Limited ఆఫర్ ధర కేవలం 3,499 కే… https://amzn.to/3ntWpti

తమకు దగ్గరలో ఉండే Xiaomi సర్వీస్ సెంటర్ కి ఫోన్ తీసుకువెళ్లి అక్కడ మాత్రమే దానికి సంబంధించిన అప్డేట్ ఫ్లాష్ చేయించుకోవడం సాధ్యపడుతుంది. సాంకేతికంగా అవగాహన ఉన్న వ్యక్తుల కోసం ఈ ఫ్లాష్ అప్డేట్ ప్రొసీజర్ అందరికీ అందుబాటులో ఆ సంస్థ పెడుతుందా లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.

ఏదేమైనా Xiaomi phoneలు వాడుతున్న వినియోగదారులు తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఆ సంస్థ మీద ఉంది. ప్రస్తుతానికి మీ phoneలో Airtel Thanks యాప్‌ని తొలగించి, రాబోయే రెండు మూడు వారాల పాటు దాన్ని మళ్లీ install చేయకండి. అలాగే క్రింది స్టెప్స్ ఫాలో అవండి:

Disable Ultra battery saver

  • Go to Settings
  • Search “Ultra”
  • Open Ultra battery saver
  • Turn off (Disable)

Also, disable the Find device option from the settings.

  • Go to settings
  • Search “Find device”
  • Select 2nd option from the search
  • Turn off the Find device.

Filed Under: Tech News Tagged With: smartphone, smartphone Troubleshooting, xiaomi airtel phone reboot problem, xiaomi airtle sim, xiaomi phone

Xiaomi phone వాడుతున్నారా? కేవలం ఈ ఫోన్స్‌కి మాత్రమే Android 11 వస్తుంది!

by

Android 11 update for Xiaomi phones

అన్ని Android phone తయారీ సంస్థలు తాము విడుదల చేసిన ఫోన్ మోడల్స్ కి Android 11 అప్డేట్ అందించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో Xiaomi సంస్థ కూడా అదే ప్రయత్నంలో ఉంది. అయితే కొన్ని మోడల్స్ కు మాత్రమే Android 11 అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ చూద్ధాం.

టెస్ట్ చేయబడినవి!

Xiaomi సంస్థ ఒక లేటెస్ట్ వెర్షన్ విడుదల చేయబోయే ముందు దాన్ని విస్తృతంగా అంతర్గతంగా టెస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని Xiaomi phoneలపై ఆ సంస్థ అంతర్గతంగా టెస్టింగ్ చేసింది. ఆ మోడల్స్ లిస్ట్ ఇది: MI 10 Ultra, MI 10 youth, MI 10 Lite zoom, MI 10 Lite 5G, MI Note 10 Lite, redmi ke 30 Ultra, redmi k30, Poco X2, redmi k30 5G, redmi k30 racing edition, redmi k30i 5G, redmi k20, redmi 10x Pro, redmi 10x 5G, redmi note 9S, redmi note 9 Pro, redmi note 9 Pro Max, redmi 9, Poco C3, redmi 9A, Coco Xperia NFC, Poco M2 Pro.

ఇప్పటికే ప్రకటించబడినవి!

ఇదిలా ఉంటే ఇప్పటికే Android 11 అప్డేట్ కచ్చితంగా అందించబడుతుంది అని ఆ సంస్థ ప్రకటించిన డివైజ్ల జాబితా ఇది. MI 9, MI 9 Pro 5G, MI 9SE, MI A3, redmi k20 Pro, MI 9t pro, black Shark 3, black Shark 3S, black Shark 3 Pro, black Shark 2, black Shark 2 Pro, Poco M2.

ఈ ఫోన్లకి అప్డేట్ రాదు

ఇప్పుడు చెప్పబోయే ఫోన్లకు Android 11 అప్డేట్ లభించే అవకాశం ఏమాత్రం లేదు. redmi Note 8 Pro, redmi Note 8, redmi note 8T, redmi Note 7 Pro, redmi Note 7, redmi note 7s, redmi 8, redmi 8A.

వీటికి వచ్చేసింది!

ఇదిలా ఉంటే Android 11 అప్డేట్ ఇప్పటికే కొన్ని ఫోన్లను అందుబాటులోకి వచ్చింది. అవి Mi 10, Mi 10 Pro, redmi k30 pro, Poco F2 Pro.

Filed Under: Tech News Tagged With: android 11 update, Android 11 update for Xiaomi phones, android phone, software update, xiaomi phone

షామీ ఫోన్లు ప్రభుత్వ నిర్ణయంతో వెనక పడతాయా?

by

షామీ ఫోన్లు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్  వెబ్సైట్ల విషయంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది పరోక్షంగా  ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల ద్వారా పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న షామీ, OnePlus, Huawei వంటి  కంపెనీలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్షణాల్లో అమ్మకాలు ఇలా!

ఇప్పటివరకు Amazon, Flipkart  వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లు, Xiaomi, OnePlus, Realme వంటి  ఫోన్ తయారీ కంపెనీలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుని, ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లని flash sales ద్వారా హాట్‌కేకుల్లా అమ్ముతున్నాయి. షామీ వంటి  సంస్థలు ఏదైనా కొత్త ఫోన్ విడుదలైన వెంటనే, కేవలం ఒకే ఒక నిమిషంలో లక్షలాది ఫోన్లు అమ్ముడైనట్లు చాలా గొప్పగా ట్వీట్ చేయగలుగుతున్నాయి అంటే, దీని ప్రధాన కారణం ఆన్లైన్ షాపింగ్ సైట్లు వాటికి సహకరించడం.

నియమాలు ఇవి..

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం,  వివిధ ఆన్లైన్ షాపింగ్ సైట్లు ఫోన్ తయారీ కంపెనీలతో చేసుకునే గరిష్ట ఒప్పందాల విషయంలో పరిమితి విధించబడింది.  అంతేకాదు, ఇప్పటివరకు షామీ వంటి ఫోన్ తయారీ కంపెనీలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకు, ఎలాంటి పరిమితి లేకుండా, అన్ని యూనిట్లనీ  ఆన్లైన్లో అమ్ముతూ వచ్చేవి. తాజాగా విధించబడిన నియమాల ప్రకారం, ఫోన్ తయారీ కంపెనీలు గరిష్టంగా 25 శాతానికి మించి తమ వద్ద ఉన్న ఇన్వెంటరీని  ఇ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా అమ్మడానికి వీలు పడదు. ఫిబ్రవరి 1 నుండి ఈ నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆఫ్‌లైన్‌లో  మొబైల్ షా‌ప్‌లు నిర్వహిస్తున్న వ్యాపారులకు ఈ నిర్ణయం చాలా మేలు చేయబోతోంది.

షామీకి ఎలా నష్టం?

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం సాంసంగ్ సంస్థకు మాత్రమే అతి పెద్ద మొత్తంలో ఆఫ్‌లైన్ మార్కెట్ షేర్ ఉంది.  దేశవ్యాప్తంగా అనేక మొబైల్ షాప్‌లతో సామ్సంగ్ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. అంతేకాదు, తనకు తాను స్వయంగా షోరూములు కూడా నిర్వహిస్తోంది. ఈ విషయంలో షామీ  వంటి కంపెనీలు వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు తప్పనిసరిగా ఈ చైనా కంపెనీలు తమ ఆఫ్లైన్ షాపుల సంఖ్యను పెంచుకోకపోతే అమ్మకాల విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఇటీవల షామీ కంటే  వెనకబడిన సామ్సంగ్ సంస్థకు ఇది పరోక్షంగా మేలు చేస్తుంది.

Filed Under: Tech News Tagged With: xiaomi phone

ఒక కెమెరాతోనే Portrait mode వస్తున్న Xiaomi Phoneలలో మీది ఉందా?

by

xiaomi phone portrait mode

Portrait Mode.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం. ఒక మనిషిని, లేదా వస్తువును హైలెట్ చేసి, వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటానికి ఈ portrait mode వెసులుబాటు కల్పిస్తుంది.

అయితే దీన్ని సాధించటానికి దాదాపు ఈ మధ్యకాలంలో అధికశాతం ఫోన్లలో dual camera setup పొందుపరచబడి ఉంటోంది. అంటే ఫోన్ వెనకభాగంలో రెండు కెమెరాలు ఉంటే వాటిలో ప్రైమరీ కెమెరా అసలు ఫొటోని కేప్చర్ చేస్తుంది, రెండో కెమెరా డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ని కేప్చర్ చేసి, మనకు బ్యాగ్రౌండ్ బ్లర్ అయ్యే ఎఫెక్టు సాధించిపెడుతుంది.

అంతవరకు బాగానే ఉంది, అయితే ఇప్పటికే ఒక కెమెరాతో మీరు కొనుగోలు చేసిన ఫోన్లో అలాంటి portrait mode సాధించాలనుకుంటే కష్టమనుకోకండి. వివిధ టెక్నిక్ల ద్వారా పలురకాల ఫోన్ మోడళ్లకి ఈ పోర్ట్రెయిట్ మోడ్ సదుపాయం ఈ మధ్యకాలంలో వస్తోంది. అదే క్రమంలో తాజాగా MIUI 10 వెర్షన్ ద్వారా Xiaomi సంస్థ కూడా తాను తయారు చేసిన వివిధ ఫోన్లకు ఈ portrait mode సదుపాయం తీసుకువచ్చింది.

లక్షకుపైగా ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అధ్యయనం చేయడం ద్వారా సింగిల్ కెమెరా ఉన్న ఫోన్లకు కూడా ఈ portrait modeని Xiaomi ప్రవేశపెట్టింది. అయితే మొదటి దశలో కొద్ది మొత్తంలో డివైజ్లకు మాత్రమే ఈ సదుపాయం రాబోతోంది. Mi Mix 2, Mi 5s, Mi 5s Plus, Mi 5, Mi Note 2, Mi Max, Mi Max 2, Redmi Note 4, Redmi Note 4X, Redmi Note 3, Redmi 5, Redmi 4, Redmi 4X వంటి ఫోన్లలో బ్యాక్ కెమెరాలో ఈ portrait mode లభిస్తోంది. అలాగే Mi 6, Redmi Note 5 ఫోన్లలో బ్యాక్ కెమెరాతో పాటు, ఫ్రంట్ కెమెరాకి కూడా portrait mode లభించబోతోంది.

ఇక మిగిలిన డివైజ్లకు రాబోయే కొద్ది నెలల్లో ఈ సదుపాయం అందించబడుతుంది.

Filed Under: Tech News Tagged With: xiaomi phone

  • Go to page 1
  • Go to page 2
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in