Xiaomi నుండి flagship phone అయిన Mi 6 ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా వేచి చూస్తున్నారా? అయితే ఇక వెయిట్ చెయ్యకండి.. అనధికారిక సమాచారం ప్రకారం Mi 6ని ఇండియాలో రిలీజ్ చేసే ఆలోచన Xiaomiకి లేదని తెలుస్తోంది.
ఏప్రిల్‌లో ఈ phone చైనా మార్కెట్లో విడుదలైంది. చైనాలో అతి పెద్ద online మార్కెట్ అయిన JD.com సైట్లో 1.2 మిలియన్ల మంది ఈ phoneని స్వంతం చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. Xiaomi చైనా కంపెనీ అవడం వల్ల తాను విడుదల చేసే కొత్త flagship phoneలను మొదట చైనా మార్కెట్లో విడుదల చేస్తుంది.
చైనాలో విడుదలైన అన్ని phone మోడళ్లూ భారతీయ మార్కెట్లోకి రావు. ఉదా.కు.. Mi Mixనే తీసుకుంటే ఈ మోడల్ ఇప్పటి వరకూ చైనాలో మాత్రమే లభిస్తూ ఉంది. Mi Max, Redmi Note 4 వంటి కొన్ని phone మోడళ్లు మాత్రమే అదీ చైనాలో విడుదలైన దాదాపు నాలుగైదు నెలల తర్వాత ఇండియాలోకి వచ్చాయి.
ఇలా కొన్ని phoneలను కొన్ని మార్కెట్లకే పరిమితం చెయ్యడానికి ప్రధాన కారణం Xiaomi చిన్న కంపెనీ కావడం.. చైనా, ఇండియా వంటి రెండు పెద్ద మార్కెట్లలో వచ్చే డిమాండ్‌కి తగ్గట్లు స్టాక్ మెయింటైన్ చెయ్యలేకపోవడం ఇతరత్రా పలు అంశాలు కారణం అవుతుంటాయి. అభిమానుల అదృష్టం బాగుండి Xiaomi సంస్థ చివరి నిముషంలో నిర్ణయం మార్చుకుంటే తప్ప Xiaomi Mi6 ఇండియాలో విడుదల కాదు.