TV, ఏసి Amazon, Flipkartలో కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి!

TV Ac selection tips Amazon Flipkart

సంవత్సరం లోనే అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ రాబోతోంది. Amazon, Flipkartలలో అనేక ఉత్పత్తులు మీద భారీగా ఆఫర్లు రాబోతున్నాయి. అయితే ఈ సేల్‌లో TV, AC వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.

టివి సెలక్షన్ విషయంలో..

మీ ఇంటి పరిమాణాన్ని బట్టి మాత్రమే టీవీ కొనుగోలు చేయాలి తప్పించి తక్కువ ధరకు వస్తోంది కదా అని మరీ పెద్ద టివి కొంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఉదాహరణ 32 అంగుళాల టీవీని నాలుగడుగుల దూరం నుంచి మాత్రమే సౌకర్యవంతంగా చూడగలుగుతాం. అలాగే 40 నుండి 48 అంగుళాల టీవీలను ఏడు అడుగుల దూరం నుండి, 55 లేదా 65 అంగుళాల టీవీలను కనీసం తొమ్మిది అడుగుల దూరం నుండి మాత్రమే సౌకర్యవంతంగా చూడగలుగుతాం. కాబట్టి మీ హాలులో అంత ఖాళీ స్థలం లభిస్తుందో లేదో పరిశీలించిన తర్వాతే సరైన పరిమాణం కలిగిన టీవీ సెలెక్ట్ చేసుకోండి.

అలాగే తక్కువ ధర కలిగిన టీవీలను కొనుగోలు చేసేటప్పుడు HD ready అని పేర్కొనబడి ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనకండి. దాని ద్వారా కేవలం 720p రిసల్యూషన్ మాత్రమే లభిస్తుంది. కనీసం 1080p రిసల్యూషన్ ఉన్న టీవీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అలాగే నేను కొనుగోలు చేసే టీవీలో కనీసం మూడు హెచ్డిఎమ్ఐ పోర్టులు, 2 USB పోర్టులు, ఆడియో జాక్, ఏ.వి. పోర్టులు, బ్లూటూత్ మరియు వైఫై రూపాయలు ఉండేలా చూడాలి. 40 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం కలిగిన టీవీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో Android 9 వంటి ఆపరేటింగ్ సిస్టం లభిస్తే మంచిది. సౌండ్ ఔట్పుట్ విషయంలో కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. లేదా ప్రత్యేకంగా సౌండ్ బార్ అయినా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఏ.సిలకు కొనేటప్పుడు

ఏ.సి. విషయంలో కంప్రెషర్ జీవితకాలం అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా నాసిరకం ఏసీలు ఎండాకాలంలో తగినంత ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఏసీ పూర్తి గా ఉన్నా కూడా చల్లదనం లభించదు. మీ రూమ్ పరిమాణానికి తగ్గట్లు ఎన్ని టన్స్ ఏసీ కావాలి అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే Amazon, Flipkartలో కొంటున్నారు కాబట్టి, ఉచితంగా ఇన్స్టలేషన్ లభిస్తుందా, సర్వీస్ విషయంలో ఎలా అప్రోచ్ అవ్వాలి వంటి వివరాలు కచ్చితంగా స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. 12×15 అడుగుల కంటే ఎక్కువ పరిమాణం కలిగిన గదుల విషయంలో 2 టన్ ఏసీ ఉత్తమం. అలాగే ఇన్వర్టర్ మోడల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general