Memory Cardల బదులు ఇక ఇవి వస్తాయి

ufs card

Phone storageని పెంచుకోవడానికి ఇంకెంతకాలం microSD కార్డులు వాడతారు? కొత్త కొత్త సదుపాయాలతో అధునాతన smartphones వస్తున్నాయి, కొత్త gadgets వస్తున్నాయి కానీ memory cardలలో మాత్రం ఎలాంటి మార్పూ చోటు చేసుకోవడం లేదని ఎప్పుడైనా మీకు అన్పించిందా? అయితే ఆ మార్పు రానే వచ్చింది.

Samsung సంస్థ ప్రస్తుతం మనం వాడుతున్న microSD కార్డులకు బదులు ఈరోజు removable UFS card ని ప్రకటించింది. UFS అంటే Universal Flash Storage అని అర్థం. ఈ కార్డులు కూడా microSD కార్డుల మాదిరిగానే 32, 64, 128, 256 GBల స్టోరేజ్ కెపాసిటీల్లో లభిస్తాయి. స్టోరేజ్ అలాగే ఉంటేనేమి… స్పీడ్ విషయానికి వస్తే మతిపోతుంది.

UFS cards భారీగా సెకనుకి 530 MB మేరకు read speedని అందిస్తుంటాయి. ప్రస్తుతం మనం వాడుతున్న microSD కార్డుల కంటే ఇది ఏకంగా 5 రెట్లు అధికం. ఈ స్పీడ్ ప్రకారం 5 GB ఫైల్ సైజ్ ఉన్న full HD మూవీని కేవలం 10 సెకండ్లలో ఈ UFS కార్డ్ నుండి ఏ డివైజ్ అయినా రీడ్ చెయ్యగలుగుతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అదే డేటాని micro SD కార్డులోకి రైట్ చేసే write speedల విషయానికి వస్తే సెకనుకి 170 MB చొప్పున write speed లభిస్తుంది. ఇది ప్రస్తుతం మనం వాడుతున్న అత్యంత వేగవంతమైన microSD కార్డు కన్నా (ఈ మధ్యనే నేను రాసిన SanDisk Extreme Pro) రెండు రెట్లు అదనంగా వేగం కలిగి ఉంటుందన్నమాట. ఈ SanDisk Extreme Pro సెకనుకి 100 MB స్పీడులో Memory Cardలోకి డేటాని రైట్ చెయ్యగలుగుతుంది. అదే ప్రస్తుతం మనం వాడుతున్న Class 10 వంటి మామూలు మెమరీ కార్డులతో పోలిస్తే ఏడు నుండి ఎనిమిది రెట్ల వేగంతో డేటా ఈ UFS కార్డులోకి రాయబడుతుంది.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

దాదాపు ప్రతీ అధునాతన ఫోన్ 4K నాణ్యతతో వీడియోలు రికార్డ్ చేస్తున్న నేపధ్యంలో, అలాగే action cams, DJI వంటి Dronesలు, 360-degree cams వినియోగం అధికమవుతున్న నేపధ్యంలో ఈ కొత్త తరం UFS కార్డులు అద్భుతమైన పనితీరుని అందించగలుగుతాయి. ఇప్పటికే Samsung సంస్థ Samsung Galaxy S6, S6 Edge వంటి ఫోన్లు మొదలుకుని తాజా S7 ఫోన్ వరకూ ఈ UFS కోవకు చెందిన మెమరీని internal storage కోనం non-removable moduleగా అందిస్తోంది. అదే టెక్నాలజీ కాస్తా ఇప్పుడు removable UFS memory card రూపంలో రాబోతోందన్నమాట. ఈ మెమరీ కార్డ్ అందుబాటులోకి వచ్చాక దాన్ని సపోర్ట్ చేసే రకరకాల smartphones మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. దాంతో మరింత వేగవంతమైన పనితీరుని చూడగలుగుతాం.

 

      Computer Era
      Logo