Video నుండి ఆడియో మాత్రమే సపరేట్ చేయాలంటే!

how to extract audio from video

మీ దగ్గర ఉన్న ఏదైనా వీడియో లో నుండి కేవలం ఆడియో మాత్రమే విడిగా సేవ్ చేయాలి అంటే అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Online Audio Converter

మీ కంప్యూటర్ లో గాని ఫోన్ లో గానీ ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండా ఈ లింక్ లో లభించే Online Audio Converter అనే వెబ్సైట్ ఉపయోగించవచ్చు. ఇది 300లకు పైగా వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు కావలసిన ఆడియోని MP3, OGG, M4A, AMR, WAV వంటి వివిధ ఫార్మాట్లలోకి సేవ్ చేసిపెడుతుంది. ఇలా కన్వర్షన్ చేసే సమయంలో అనేక కీలకమైన సెట్టింగ్స్ కూడా మీకు నచ్చినట్టు ఎంపిక చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ లేదా ఫోన్ లో నుండి ఫైల్స్ అప్లోడ్ చేయడం మాత్రమే కాకుండా Drobox, Google Drive వంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

యూట్యూబ్ వీడియో నుండి

ఏదైనా యూట్యూబ్ వీడియో నుండి కేవలం ఆడియో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ లింక్ లో లభించే Record MP3 అనే వెబ్సైట్ ఉపయోగపడుతుంది. దీంట్లో కన్వర్షన్ మొదలైన తర్వాత చిన్నగా ఉండే డౌన్లోడ్ రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయండి. పెద్దదిగా ఉండే Download Now బటన్ అసలు క్లిక్ చేయకండి. మీకు కావలసిన యూట్యూబ్ వీడియో లింక్ ఈ వెబ్ సైట్లో పేస్ట్ చేసి, MP3 ఆడియో ఫార్మెట్లో మీకు కావలసిన ఆడియోని పొందవచ్చు.

Windows కంప్యూటర్లో

మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్ వాడుతున్నట్లయితే Audacity అనే ఉచిత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా వీడియో నుండి ఆడియో మాత్రమే విడిగా సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆడియో కి సంబంధించి ఎన్నో రకాల ఎడిటింగ్ సదుపాయాలు కూడా దీంట్లో మనకు లభిస్తూ ఉంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Online Converter

పైన మనం చూసిన ఆన్లైన్ ఆడియో కన్వర్టర్ మాత్రమే కాకుండా, ఈ లింకులో Online Converter అనే మరో వెబ్సైట్ కూడా లభిస్తుంది. దీని ద్వారా గరిష్టంగా 200MB నిర్మాణం కలిగిన వీడియో ఫైల్ అప్లోడ్ చేసి దానినుండి ఆడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనేక రకాల వీడియో ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo