Whatsappని రిలయెన్స్ కొనుగోలు చేసిందా?

whatsapp reliance

మనందరి ఫేవరెట్ మెసెంజర్ యాప్ Whatsappని ఇండియాకి చెందిన Relince కంపెనీ కొనుగోలు చేసిందా? Whatsappలో తాజాాగా చలామణి అవుతున్న ఓ న్యూస్ అవుననే నిర్థారిస్తోంది. అయితే ఇది ఒట్టి పుకారు. ఇంకా కామెడీ ఏంటంటే ఇది ఈరోజు కొత్తగా పుట్టుకు వచ్చిన పుకారు ఏమాాత్రం కాదు. సంవత్సరం నుండి చలామణి అవుతున్నదే. అయితే తాజాగా Reliance Jio విపరీతంగా ప్రజాదరణ పొందడంతో ఈ పుకారుని చాలామంది గుడ్డిగా నమ్ముతున్నారు.

Whatsppని Reliance కొనుగోలు చేయడం అన్నది కేవలం పుకారు మాత్రమే కాదు.. దీని వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నకిలీ మెసేజ్‌లో Varun Pulyani అనే వ్యక్తిని Whatspp డైరెక్టర్‌గా పేర్కొన్నారు. సో వరుణ్ Whatsappని రిలయెన్స్‌కి చెందిన ముఖేష్ అంబానీకి 19 బిలియన్ డాలర్లకి అమ్మాడన్నది ఈ fake news సారాంశం.

ఈ మెసేజ్ చదివిన ప్రతీ ఒక్కరూ ఓ 10 మంది తమ మిత్రులకూ, తాము భాగస్వాములుగా ఉన్న గ్రూప్‌లకూ షేర్ చెయ్యాలని, అలా చేస్తే మాత్రమే యాజమాన్యం మారిన తర్వాత కొత్త Whatsappలో వారు ఉచితంగా, నిరాటంకంగా సర్వీస్ వాడుకోగలుగుతారనీ, లేదంటే Whatsapp సర్వీస్‌కి అంతరాయం ఏర్పడుతుందనీ ఈ మెసేజ్ భయపెడుతోంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అంతేకాదు Whatsappని Facebookకి కనెక్ట్ చెయ్యాలనీ, ఓ లింక్‌ని కూడా ఈ స్పామ్ మెసేజ్‌లో హ్యాకర్ పొందుపరిచాడు. తెలిసీ తెలియక అమాయకులు ఈ లింక్‌ని గనుక క్లిక్ చేసినట్లయితే మీ smartphoneలోకి malware ప్రవేశించి మరింత హానిని తలపెడుతుంది. Whatsapp సంస్థని గతంలోనే Facebook కొనుగోలు చేసింది. బాగా ప్రజాదరణని కలిగిన  ఈ సర్వీస్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ Facebook ఇతరులకు అమ్మదు అన్న విషయం అర్థం చేసుకోండి. సో ఇలాంటి అసత్యాలను షేర్ చెయ్యడం మానేసి ఇలా నిజాలను విడమర్చి చెప్పే పోస్టులను షేర్ చెయ్యడం అలవాటు చేసుకుంటే అమాయకులకు ఇవన్నీ అర్థమవుతాయి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general