Whatsappలో కొత్తగా వచ్చిన మరో రెండు సూపర్ ఫీచర్లు!

Whatsapp mute notifications forever feature

Whatsappలో వివిధ రకాల వ్యక్తుల నుండి వచ్చిన ఫార్వర్డ్ ఫోటోలు మరియు వీడియోలను సులభంగా డిలీట్ చేసుకోవడానికి, తద్వారా స్పేస్ సులభంగా ఆదా చేసుకోవడానికి కొత్తగా వచ్చిన సదుపాయం గురించి నిన్న https://youtu.be/btwn1Oo_oyI లింకులో video demo చూసే ఉంటారు. లేదంటే దాన్ని ఇప్పుడు చూడొచ్చు.

ఆ సదుపాయంతో పాటు మరో రెండు సదుపాయాలు కూడా Whatsapp యూజర్లకి అందుబాటులోకొచ్చాయి. అందులో మొట్ట మొదటిది Always Mute సదుపాయం. మీ పరిచయస్తుల్లో ఎవరైనా వ్యక్తి ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లాంటి మెసేజ్ లతో విసిగిస్తూ ఉన్నట్లయితే, అలాంటి సందర్భంలో సంబంధిత ఛాట్‌ని మ్యూట్ చేసుకోవడానికి ఇప్పటివరకు కేవలం గరిష్ఠంగా ఏడాది సమయం మాత్రమే లభించేది. ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తికి సంబంధించిన మెసేజ్‌లు శాశ్వతంగా మ్యూట్ చేసుకునే అవకాశం Whatsappలో కల్పించబడింది. దీనికోసం మీరు చేయవలసిందల్లా సంబంధిత వ్యక్తి ఛాట్ లోకి వెళ్లి Mute Notifications అనే విభాగంలో Always అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

దీంతోపాటు అందుబాటులోకి వచ్చిన మరో ఆప్షన్, Whatsapp ద్వారా స్నేహితులకు ఏమైనా ఫోటోలు పంపించేటప్పుడు, పంపడానికి ముందు ఎడిటింగ్ చేయడానికి filters ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, స్టిక్కర్ల వంటివి కూడా జత చేసుకుంటూ ఉంటాం కదా. అలా స్టిక్కర్లని జత చేసేటప్పుడు కొత్త సదుపాయం ప్రవేశపెట్టబడింది. ఫోటో మీద మీరు అమర్చే స్టిక్కర్ సక్రమంగా అలైన్మెంట్ అవ్వడం కోసం guidelines కొత్తగా అందించబడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకుని సరైన ప్రదేశంలో స్టిక్కర్ అమర్చుకోవడానికి సాధ్యపడుతుంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ రెండు సదుపాయాలు ప్రస్తుతానికి Whatsapp Beta వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్నాయి. రెండు మూడు వారాల తర్వాత Whatsapp Final వెర్షన్ వాడుతున్న అందరు వినియోగదారులకు ఖచ్చితంగా వస్తాయి. వాస్తవానికి వాట్సప్ బిజినెస్‌కి సంబంధించి, వాయిస్ వీడియో కాల్ బటన్ తొలగిస్తూ మరో మార్పు కూడా చోటు చేసుకుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo