

Whatsapp మరో వినూత్నమైన సదుపాయాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి Whatsapp అధికారిక వెబ్సైట్లో అంతర్గతంగా రిఫరెన్స్ లభించింది.
Disappearing Messages పేరుతో పిలవబడే ఈ ఫీచర్, మనం పంపిన మెసేజ్ లు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తుంది. అంటే నేను మీ ఫ్రెండ్ కి Whatsapp ద్వారా ఒక మెసేజ్ పంపించారు అనుకోండి. అవతలి ఉన్న వ్యక్తి దాన్ని చదివినా చదవకపోయినా ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత అది ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది.
ఈ Disappearing Messages సదుపాయానికి Whatsapp వారం రోజుల గడువు పెట్టింది. అంటే దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు, మీరు అవతలి వ్యక్తికి పంపించిన మెసేజ్ వారం రోజుల తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అవతలి వ్యక్తి కూడా ఇదే సదుపాయాన్ని ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే మీరు పంపించిన మెసేజ్ ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి దీన్ని ఎనేబుల్ చేసుకోకపోతే, మీరు మాత్రమే ఎనేబుల్ చేసుకుని ఉన్నట్లయితే.. మీరు పంపించిన మెసేజ్ అవతలి వ్యక్తి ఫోన్ లో శాశ్వతంగా ఉండిపోతుంది.
Disappearing Messagesలో అనేక లోపాలు ఉన్నాయి. ఒకవేళ అవతలి వ్యక్తి వారం రోజుల పాటు అసలు Whatsapp ఓపెన్ చేయకపోయినా కూాడా ఆ మెసేజ్ దానంతట అదే డిలీట్ అయిపోతుంది. ఇంతకుముందు పంపించిన మెసేజ్‌ని కోట్ చేస్తూ మీరు మరో మెసేజ్ పని పంపినట్లయితే, అలా కోట్ చేయబడిన భాగంలో గడువు తీరిన తర్వాత కూడా ఆ మెసేజ్ అలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు పంపించిన మెసేజ్ ని అవతలి వ్యక్తి ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా కూడా, ఏడు రోజుల తర్వాత ఆ మెసేజ్ డిలీట్ కాకుండా అలాగే కొనసాగుతుంది.