Whatsappలో వచ్చిన మూడు కొత్త ఫీచర్లు ఇవి!

Whatsapp వినియోగదారులకు శుభవార్త. ఎప్పటికప్పుడు వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగించే విధంగా అనేక కొత్త సదుపాయాలను అందిస్తున్న ఆ సంస్థ తాజాగా మరో మూడు సదుపాయాలను ప్రవేశపెట్టడం కోసం సన్నాహాలు చేస్తోంది. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advanced Search

ఇప్పటివరకు కేవలం వాట్సాప్ లో కాంటాక్టులను మాత్రమే సెర్చ్ చేయడానికి అవకాశం ఉండేది. దానికి భిన్నంగా తాజాగా వాట్సాప్ బీటా వెర్షన్ లో Advanced search ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా ఇకమీదట మీ వాట్సప్ అప్లికేషన్ లో మీకు వచ్చిన అన్ని రకాల ఫోటోలు, GIF యానిమేషన్లు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి వాటిని చాలా సులభంగా వెదికి పట్టుకోవచ్చు. కావాల్సిన కంటెంట్ గుర్తించటం కోసం చాలా ఇబ్బంది పడే వారికి ఇది బాగా ఉపయుక్తం గా ఉంటుంది.

బ్యాకప్‌కి ప్రొటెక్షన్

వాట్సాప్ లో ప్రతిరోజు మనం బ్యాకప్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే కనుక, ఎప్పటికప్పుడు డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లోకి బ్యాకప్ తీయబడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే దానికి అదనంగా తాజాగా, మీరు బ్యాకప్ తీసే డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేయబడే విధంగా పాస్వర్డ్‌తో రక్షించుకునే అవకాశం కల్పించబడుతుంది. ఇలా ఎన్క్రిప్ట్ చేయబడిన తర్వాత, మీ డేటా మొత్తాన్ని అటు వాట్స్అప్ గానీ, గూగుల్ గానీ ఏ మాత్రం యాక్సెస్ చేయలేదు.

Downloads విషయంలో

మన కాంటాక్ట్స్ లో ఉన్న అనేకమంది వాట్సాప్ ద్వారా పెద్దమొత్తంలో మెసేజ్లు పంపించడం వల్ల, వాడితో పాటు ఉండే ఫోటోలు మరియు వీడియోలు డౌన్లోడ్ మన ఫోన్ లో స్టోరేజ్ మొత్తం నిండి పోతూ ఉంటుంది. ఇబ్బందిని ఎదుర్కోవడం కోసం వాట్సాప్ ఇకమీదట auto download అయ్యే కంటెంట్ విషయంలో కొన్ని రూల్స్ పెట్టబోతోంది. ఒకవేళ ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ గా గుర్తించబడినట్లయితే, అలాంటి మెసేజ్ ద్వారా వచ్చే ఫోటో లేదా వీడియోలు, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వకుండా నిలిపి వేయబడతాయి. నిజంగా మీకు కావాలి అనుకుంటే మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఇప్పటికే వాట్స్ బీటా వెర్షన్‌లో మొదటి రెండు ఫీచర్లు ప్రవేశపెట్టబడ్డాయి. పైన చెప్పబడిన మూడు ఫీచర్లు వాట్స్అప్ వాడడం వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.

Tags:

Computer Era
Logo