
ఇటీవల Facebook privacy విషయంలో అనేక సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో Whatsappలో privacy, సెక్యూరిటీ పై కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో Whatsapp తాజాగా ఈ విషయంపై స్పందించింది.
ఇద్దరు వ్యక్తులు Whatsapp ద్వారా పంపుకునే మెసేజ్‌లు వాట్సప్ చదువుతుందన్న అనుమానాలు పలువురు వెలిబుచ్చుతున్న సందర్భంగా వాట్సప్ ఈ స్పష్టతనిచ్చింది. Whatsappని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చూపించబడే అగ్రిమెంట్ లోని కొన్ని అంశాలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయని ఇటీవల ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ నేపథ్యంలో Whatsapp స్పందిస్తూ.. కేవలం అతి కొద్ది మొత్తంలో సమాచారాన్ని మాత్రమే Whatsapp స్వీకరిస్తుందని, ఇద్దరు వ్యక్తులు జరుపుకునే సంభాషణలు పూర్తిగా end-to-end encryption విధానం ద్వారా రక్షించబడతాయి అని పేర్కొంది. సంభాషణ ఎవరు ఏ IP అడ్రస్ నుండి ఏ సమయంలో జరిపారు, online, offlineలోకి ఎప్పుడు వెళ్లారు వంటి సమాచారం మాత్రమే Whatsapp తమ దగ్గర ఉంచుకుంటుంది.