
కొంతకాలం క్రితం ముంబై డ్రగ్స్ కేసులో నిందితుల Whatsapp Backup ఆటోమేటిక్ గా Google Driveలో సేవ్ అవడం వల్ల పోలీసులు దాన్ని చేజిక్కించుకుని, ఆ ఛాట్ పబ్లిక్ లోకి రావడం తెలిసిందే. ఇలాంటివే ఇటీవల అనేక సందర్భాలు ఎదురవుతున్న నేపథ్యంలో Google Driveలో సేవ్ అవుతున్న Whatsapp Backup పట్ల వినియోగదారులకు నమ్మకం పోతోంది.
ఈ విషయాన్ని గుర్తించిన Whatsapp సంస్థ తాజాగా ఒక శక్తివంతమైన సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. Android phoneలు వాడుతున్న యూజర్లకి Google Drive, iPhoneలు వాడుతున్న యూజర్లకు iCloudలో సేవ్ అయ్యే Whatsapp Backupని ఎవరూ నేరుగా యాక్సెస్ చెయ్యకుండా ఉండడం కోసం ఛాట్ backupలను పాస్వర్డ్‌తో రక్షించే ఫీచర్‌ని ఆ సంస్థ తీసుకొస్తోంది.