
ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ చేసుకోవటానికి Whatsapp ఎంత ఉపయుక్తంగా ఉంటుందో, అన్ని ప్రమాదాలు వాట్స్అప్ ద్వారా లేకపోలేదు.
ముఖ్యంగా వాట్సప్‌లో ఈ మధ్యకాలంలో అనేక ప్రమాదకరమైన లింకులు సర్క్యులేట్ అవుతున్నాయి. పొరపాటున వాటిని క్లిక్ చేస్తే ప్రమాదంలో పడతాం. ఉదాహరణకు ఫలానా బిగ్బజార్ సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 1500 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అంటూ ఒక మెసేజ్ Whatsappలో సర్క్యులేట్ అవుతుంది. చూడడానికి official website link ఎలా కనిపిస్తుందో, సరిగ్గా అదే విధంగా ఈ లింక్ కూడా కనిపించేటప్పటికి వెనకా ముందు ఆలోచించకుండా చాలామంది గుడ్డిగా దాన్ని క్లిక్ చేస్తారు.
అంతే, వెంటనే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ఫిషింగ్ అటాక్ పొంచి ఉంటుంది. ఇలా చాలా సందర్భాల్లో బాగా పాపులర్ అయిన వ్యాపార సంస్థలు, వెబ్సైట్ల పేరిట అనేక ప్రమాదకరమైన లింకులు వాట్స్అప్ ద్వారా సర్కులేట్ అవుతున్నాయి. వీటిని అడ్డుకోవడం కోసం తాజాగా వాట్సప్‌లో Suspicious Link Detection అనే సరికొత్త సదుపాయం ప్రవేశపెట్టబడింది. Whatsapp Beta 2.18.204 వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది.