మీ దగ్గర Xiaomi phone ఉందా? అయితే మీ phoneలో Whatsapp ఈరోజు నిన్న అర్థరాత్రి 12 గంటల నుండి పనిచెయ్యట్లేదు కదా?
ఈ సమస్య మీ ఒక్కరికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది దీన్ని ఫేస్ చేస్తున్నారు. అయితే కొన్ని Xiaomi phoneలలో మాత్రం ఎలాంటి సమస్యా లేదు. Whatsapp పరంగా ఎలాంటి సమస్యా లేదని, కేవలం phone handset తయారీదారులు తమ Whatsapp clientని ఎలా preinstall చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్న దాని మీద ఈ సమస్య తలెత్తుతోందని Whatsapp స్పష్టం చేసింది.
నిన్న అర్థ రాత్రి నుండి Whatsappని ఓపెన్ చేసిన కొంతమంది Xiaomi యూజర్లకి.. This version of Whatsapp became obsolete on 13-Jan-218. Please go to the Google Play Store to download the latest version అంటూ ఓ మెసేజ్ కన్పిస్తోంది. ఆ క్రిందనే ఉండే Update బటన్‌ని ప్రెస్ చేస్తే Google Play Store ఓపెన్ అవుతోంది కానీ Whatsappకి ఎలాంటి update లభించట్లేదు.
ఈ సమస్యని Xiaomi సంస్థే స్వయంగా పరిష్కరించవలసి ఉంది. చివరకు ఈ మెసేజ్‌లో చూపిస్తున్నట్లు చాలా మంది Xiaomi యూజర్లు Whatsapp Beta programలో చేరలేదు కూడా!
సొల్యూషన్: ప్రస్తుతానికి ఈ లింక్ నుండి Whatapp official appని download చేసుకుని ఇన్‌స్టాల్ చేస్తే ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.