Xiaomi MIUI 12 మీ ఫోన్ కి వస్తుందా లేదా వివరాలు ఇక్కడ!

మీరు Xiaomi సంస్థ తయారు చేసిన ఫోన్ వాడుతున్నట్లయితే, రాబోయే కొద్ది వారాల్లో MIUI 12 విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అన్న విషయం ” కంప్యూటర్ ఎరా”లో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో MIUI 12 ఏ ఏ ఫోన్ లభించబోతోంది అన్న విషయం తాజాగా లీక్ అయింది. ఈ సమాచారం ప్రకారం మొట్టమొదట ఆ సంస్థకు చెందిన ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన Mi 10, Mi 10 Pro, Mi 9, Mi 9 Se, Mi 9 Pro, Mi 8 లతోపాటు Mi Mix 3, Mi Mix 2S, Mi Mix 2లకి MIUI 12 అప్డేట్ రాబోతోంది. దాంతో పాటుగా కొన్ని Redmi ఫోన్ లకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి. వీటిలో Redmi K30కి మొట్టమొదట అప్డేట్ వస్తుంది. ఆ తర్వాత క్రమంలో redmi 8 Pro, redmi Note 8, redmi 7 Pro, redmi Note 7, redmi 8, redmi 8A, redmi 7, redmi 7A ఫోన్ లకు MIUI 12 అప్డేట్ లభించే అవకాశం ఉంది.

అయితే ఈ ఫోన్ లకు బేటా అప్ డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక timeline వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. MIUI 12 ద్వారా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం లో గూగుల్ సంస్థ అందించిన అనేక రకాల సదుపాయాలను షామీ ఫోన్లో వాడే వినియోగదారులు పొందొచ్చు.

ఇక్కడ పేర్కొనబడని ఇతర ఫోన్లకు కూడా దశలవారీగా అప్డేట్ లభించే అవకాశం ఉంది. కొన్ని ఫోన్లకు మొట్టమొదట బేటా అప్డేట్ లభించి, ఆ తర్వాత ఫైనల్ వెర్షన్ అందించబడుతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo