Xiaomi phoneలు ఈ ఏడాది మరింత పవర్‌ఫుల్‌గా రాబోతున్నాయా?

xiaomi phone

చైనాకి చెందిన Xiaomi phoneలను భారతీయులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అయితే Xiaomi లేటెస్ట్ phone కొనాలంటే మార్కెట్లో అంత ఈజీగా దొరకని పరిస్థితి ప్రతీ mobile  యూజర్‌నీ చిరాకు పరుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది Xiaomi సంస్థ CEO Lei Jun మూడు ఛాలెంజ్‌‌లను ప్రధానంగా తీసుకున్నాడు.

కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడం Xiaomi ముందున్న మొదటి టార్గెట్. మిగతా smartphone తయారీదారుల కంటే ముందుండాలంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తాము తయారు చేసే phoneలలో ప్రవేశ పెట్టడం చాలా అవసరం అని Xiaomi భావిస్తోంది. వీలైనంత phoneల క్వాలిటీ మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడడం జియోమీ ముందున్న రెండో లక్ష్యం.

ఇప్పటికే Xiaomi phoneలు చాలా చవక ధరల్లో అద్భుతమైన స్పెసిఫికేషన్లు, పనితీరు కలిగి ఉంటాయన్న నమ్మకం వినియోగదారుల్లో ఏర్పడింది. దాన్ని నిలబెట్టుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. అందుకే మరింత శక్తివంతంగా phoneలను తయారు చెయ్యాలని నిర్ణయించింది.  ఇక మూడవ లక్ష్యం మనం అందరం తరచూ ఎదుర్కొంటున్నది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఒక Xiaomi phoneని స్వంతం చేసుకోవాలంటే Flash saleలో పోటీపడి phone స్వంతం చేసుకోలేక నిరుత్సాహంగా ఆగిపోవడం తప్పించి వేరే మార్గం కన్పించట్లేదు. దీంతో కొంతమంది వినియోగదారుల్లో Xiaomi phoneలు అంటే వ్యతిరేకత కూడా పెరుగుతోంది. తగిన స్టాక్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటోంది. ఈ నేపధ్యంలో కనీసం ఈ ఏడాది చివరి నాటికైనా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం Xiaomi లక్ష్యంగా ఉంది.

Tags:

Computer Era
Logo