

Xiaomi, Mi phoneలు వాడుతున్న అనేకమంది Airtel వినియోగదారులు తాజాగా దేశవ్యాప్తంగా విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు.
ఉన్న ఫళంగా phone క్రాష్ అయిపోవడం, హోమ్స్క్రీన్ రాకుండా మళ్లీమళ్లీ బూట్ లూప్లో ఇరుక్కోవడం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో యూజర్లు తమ ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికైతే Airtel మాత్రమే కాకుండా ఇతర SIM కార్డులను ఉపయోగించినా కూడా సమస్య ఎదురవుతోంది. దీనికి సంబంధించి పరిష్కారాన్ని అప్డేట్ చేసే ప్రయత్నంలో Xiaomi ఇప్పటికే ఉంది. Airtel సంస్థ ఈ పరిష్కారాన్ని అందించడం కోసం Xiaomi సంస్థతో కలిసి పని చేస్తోంది.
చాలా మంది వినియోగదారులకు Find Device Closed Unexpectedly అనే మెసేజ్ స్క్రీన్ మీద చూపించబడి ఇబ్బంది ఏర్పడుతోంది. ఆ తర్వాత ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది. అప్లికేషన్ అప్డేట్ సమయంలో నిర్దిష్టమైన కోడ్ సక్రమంగా పని చేయకపోవడం వలన ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే వారానికి దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఇబ్బంది కరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ సమస్య ఎదుర్కొంటున్న వినియోగదారులు ఈ కొత్త అప్డేట్ తమకు తాము ఇన్స్టాల్ చేసుకునే అవకాశం లేదు.
Zebronics Zeb-Juke Bar 5 Multimedia Sound Bar with Bluetooth Connectivity,USB Input and Built-in FM అసలు ధర MRP:7,399 కాగా ప్రస్తుత Limited ఆఫర్ ధర కేవలం 3,499 కే… https://amzn.to/3ntWpti