Xiaomi phone వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త!

miui 9.5 update

మీ దగ్గర Redmi Note 3, Note 4, Redmi 5, 5A, 3S, 4A, Redmi 4 Prime, Mi Max, Mi Max Prime, Redmi Note 5, Note 5 Pro.. వంటి పలురకాల షియోమీ ఫోన్లు ఉన్నాయా? అయితే మీకో శుభవార్త!

MIUI 9.5 స్టేబుల్ అప్డేట్ మీ ఫోన్‌ని రావడం మొదలైంది. ఇప్పటికే కొంతమందికి లభించి ఉండవచ్చు. మరికొంతమందికి రాబోయే కొద్ది గంటల్లో, కొద్దిరోజుల్లో ఈ అప్డేట్ అందించబడుతుంది. దీనికోసం ఇది ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన పనిలేదు. ఒకసారి మీ ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి Updates ఛెక్ చేసుకోండి సరిపోతుంది.

MIUI 9.5 NCFMIFA పేరుతో మొత్తం 30 రకాల షియోమి ఫోన్లకు ఈ అప్డేట్ విడుదల చేయబడింది. ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్లు మరింత మెరుగ్గా పని చేయటానికి వీలుగా పలు ఆప్టిమైజేషన్ లు దీంట్లో ప్రవేశపెట్టబడ్డాయి. అలాగే ఇప్పటికే ఉన్న అనేక లోపాలు సరి చేయబడ్డాయి కూడా!

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అయితే ఈ MIUI 9.5 అప్ డేట్ కూడా Android Nougat 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తుంది. Android Oreo ఇక విడుదల చేయబడలేదు. Redmi Note 5 phoneలు వాడుతున్నవారికి Android Oreo ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాగో గతంలో మన కంప్యూటర్ ఎరాలో ఈ లింకులో చెప్పుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. మిగతా ఫోన్లకి ప్రస్తుతానికి ఇలా సాధ్యపడదు.

MIUI 9.5.3.0 NEGMIFA పేరుతో పిలవబడే ఈ సరికొత్త అప్‌డేట్లో క్విక్ సెర్చ్ ఆప్షన్లు, Mi Mover అప్లికేషన్లో మధ్యలో నిలిచిపోయిన ట్రాన్స్ఫర్ లను రెజ్యూమ్ చేసుకునే అవకాశం, ఆప్టిమైజ్ చేయబడిన బ్రౌజర్ కెర్నల్, సరికొత్తగా ఉన్న స్టార్ట్ పేజీ, స్క్రీన్ రికార్డర్ అప్లికేషన్‌‌కి సౌండ్ రికార్డింగ్ ఆప్షన్లు వంటి పలు అదనపు సదుపాయాలు దీంట్లో చోటుచేసుకున్నాయి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/DiKzjROIUPX3u9KKPyaCbg అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo