Xiaomi phone వాడుతున్నారా? MIUI 12 ద్వారా కొత్తగా వస్తున్న సదుపాయాలు ఇవి!

xiaomi MIUI12 update

మీరు Xiaomi సంస్థ తయారు చేసిన ఏదైనా ఫోన్ వాడుతున్నట్లయితే, దానికి అతి త్వరలో MIUI 12 రూపంలో సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతోంది. అందులో అనేక సదుపాయాల గురించి తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది.

Xiaomi సంస్థ అక్టోబర్ 2019లో MIUI 11ని విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఆ పాత వెర్షన్ కి సంబంధించిన beta romల మీద ఆ సంస్థ పని చేయటం నిలిపివేసింది. ప్రస్తుతం MIUI 12 మీద పూర్తిగా దృష్టి నిమగ్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ లోగో కూడా జనవరి 2020 లో ఆ సంస్థ చేత విడుదల చేయబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనాకు చెందిన MIUI కమ్యూనిటీలో MIUI 12 వెర్షన్‌లో చోటు చేసుకునే కొత్త సదుపాయాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీన్ని బట్టి అది దాదాపు పూర్తి అయినట్లుగా అర్థమవుతోంది.

ఎలాంటి కొత్త సదుపాయాలు?

ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం Android 10 ఆపరేటింగ్ సిస్టంకి అనుగుణంగా ఉండే విధంగా కొత్త యానిమేషన్లు, gesturesని ఈ అప్ డేట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. స్క్రీన్ అడుగుభాగంలో ఒక సన్నటి బార్ అమర్చటం ద్వారా, ఇంతకుముందు అప్లికేషన్లకు సులభంగా వెళ్లే విధంగా ఏర్పాటు చేయబడింది. అలాగే Google Pixel డివైజ్లలో మాదిగా పైకి స్వైప్ చేస్తే ఇంతకుముందు ఓపెన్ చేయబడిన అప్లికేషన్స్ జాబితా కనిపిస్తుంది. ఈ సమయంలో మల్టీటాస్కింగ్ యానిమేషన్ మనకు దర్శనమిస్తుంది.

Camera అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ పూర్తిగా నవీకరించబడింది. ఇటీవలి కాలంలో అన్ని రకాల Xiaomi ఫోన్లు శక్తివంతమైన కెమెరా ఫ్రేమ్‌వర్క్ కలిగి ఉండటం వల్ల కెమెరా అప్లికేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టబడింది. అలాగే వివిధ రకాల అప్లికేషన్లకు కొత్త ఐకాన్లు, సిస్టం హెల్త్ సర్వీస్ దీంట్లో రాబోతున్నాయి. అన్ని అప్లికేషన్లకు ఆటోమేటిక్గా డార్క్ మోడ్ అప్లై చేయబడి విధంగా global inversion dark mode కూడా దీంట్లో వస్తుంది. అలాగే నోటిఫికేషన్ బాక్స్ మెకానిజం ద్వారా ఒకే రకమైన నోటిఫికేషన్స్ అన్నీ కూడా గ్రూప్ చేయబడతాయి. ఈ అప్డేట్ అన్ని రకాల Xiaomi phoneలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo