Mobile users depends on recharge outlets to recharge their mobiles. If you watch this video, you no more need to visit outlets. You can recharge your mobile from your desk with any debit, credit cards. You can recharge Airtel aircel reliance vodafone docomo etc.. online with this method.
Sridhar Nallamothu
Editor
Computer Era telugu magazine
సెల్ ఫోన్ రీఛార్జ్ కోసం షాపులకు వెళ్తుంటారా? ఈ వీడియో చూస్తే ఇక మానేస్తారు!
సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే దగ్గర్లో రీఛార్జ్ షాప్ ఎక్కడ ఉందా అని వెదుక్కోవలసిన పనిలేదు. ఈ వీడియోలో నేను చెప్పిన పద్ధతిని ఫాలో అవండి.. ఇక 365 రోజులూ, 24 గంటలూ ఎప్పుడు కావాలన్నా అప్పటికప్పుడు మీ పిసి నుండే రీఛార్జ్ చేసుకోవచ్చు.
నావరకూ నేను సెల్ ఫోన్ రీఛార్జ్ కోసం షాప్ కి వెళ్లి 3 సంవత్సరాలవుతోంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఈ పద్ధతి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో!
చాలామంది క్రెడిట్ కార్డ్ ఉంటేనే ఆన్ లైన్ లో రీఛార్జ్ చేసుకోవచ్చనుకుంటారు. ATM కార్డ్ ఉన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయమున్నా చాలు. ఎంచక్కా రీఛార్జ్ చేసుకోవచ్చు.
మరెందుకు ఆలస్యం.. వీడియో చూస్తే మీకే నమ్మకం కలుగుతుంది. ఇక మీరే చేసుకోగలరు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.
నల్లమోతు శ్రీధర్