When we try to find latest updates for our Windows operating system, Windows Update usually shows optional updates also along with important updates. We can hide optional updates by following this video tutorial.
అవసరం లేని Updates కూడా విండోస్ లో చూపించబడుతున్నాయా? ఇలా చేయండి (వీడియో డెమో)
విండోస్ లో మనం Windows Update ద్వారా కొత్త అప్ డేట్లని వెదికేటప్పుడు ముఖ్యమైన అప్ డేట్లతో పాటు అస్సలు అవసరమే లేని Language packలూ, ఇతర ఆప్షనల్ అప్ డేట్లు కూడా చూపించబడుతూ ఉంటాయి.
మనం మన కంప్యూటర్ up-to-dateగా ఉండాలని కోరుకుంటాం. Updates కోసం వెదికినప్పుడు Your system is up-to-date అని విండోస్ చూపిస్తే మనకు అదో సంతృప్తి. అయితే ఇలా అవసరం లేని ఆప్షనల్ అప్ డేట్ల వల్ల ఎప్పుడూ ఏదో పెండింగ్ ఉన్న ఫీలింగే కలుగుతుంది.
ఈ నేపధ్యంలో విండోస్ లో మనకు అవసరం లేని ఆప్షనల్ అప్ డేట్స్ ఇకపై చూపించబడకుండా దాచిపెట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.