Most of the people forget Windows 7, Windows XP, Windows Server 2003, 2008, Vista adminstrator passwords and in a frustration they formats hard disk. So finally they loose important data, they have to reinstall all the previous installed programs. It’s painful task. In this video tutorial I explained how to reset forgotten Windows adminstrator password in simple steps.
మీరు విండోస్ 7, Vista, XP పాస్ వర్డ్ మర్చిపోయారా? ఫార్మేట్ చేయొద్దు, ఇంత ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు (వీడియో డెమో)
Small Note: ప్రతీ పిసి యూజర్ నీ వేధించే ఈ సమస్య గురించి ప్రపంచంలో ఎక్కడైనా నేను ఈ వీడియోలో చూపించినంత స్పష్టంగానూ, అన్ని దశలనూ వివరిస్తూ డిమాన్ స్ట్రేషన్ ని ఎవరూ వెదికిపట్టుకోలేరని ఖచ్చితంగా చెప్పగలను. మనం అంతర్జాతీయ ప్రమాణాల కోసం అర్రులు చాస్తాం. ముందుగా మన తెలుగులోనూ అంతకన్నా మెరుగైన వనరులు ఉన్నా ఉపయోగించుకోము. ఇది నా నిస్పృహ అనుకోకండి 🙂 జస్ట్ కాజువల్ గా గుర్తొచ్చి చెప్తున్నానంతే! అసలు విషయానికి వస్తే..
విండోస్ లోకి ఎంటర్ కావడానికి పాస్ వర్డ్ మర్చిపోయారనుకుందాం..
“ఇంకేముంది.. కంప్యూటర్ ని ఫార్మేట్ చేయాల్సిందే.. లాభం లేదు” అని చాలామంది సలహాలిచ్చేస్తుంటారు.
కేవలం మీరు వాడే విండోస్ పాస్ వర్డ్ ని (అది అడ్మిని స్ట్రేటర్ అకౌంట్ కావచ్చు, సాధారణ యూజర్ అకౌంట్ కావచ్చు) మర్చిపోయిన పాపానికి format చేసేయడమేనా శిక్ష?
ఈ వీడియో చూడండి.. నేను స్వయంగా పాస్ వర్డ్ ని మర్చిపోయి.. అలా మర్చిపోయిన దాన్ని ఎంత ఈజీగా రీసెట్ చేశానో, ప్రాబ్లెం ఎంత ఫాస్ట్ గా సాల్వ్ అయిందో అర్థమవుతుంది.
ఎవరైనా కావచ్చు.. పాస్ వర్డ్ ని మర్చిపోయారు కదా అని విండోస్ ని వదులుకోవలసిన పనిలేదు. దాన్ని చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. దీనికోసం పలు పద్ధతులు వాడుకలో ఉన్నా నేను చాలా సులభమైన పద్ధతిని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూశారంటే ఇక ఇది చాలా చిన్న సమస్య అన్పించేస్తుంది మీకు!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్